నర్తనశాల వైఫల్యం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాడు హీరో నాగశౌర్య. వరుసగా సినిమాలు ఓకె చేస్తున్నాడు. నందినీ రెడ్డి బేబి పూర్తయిపోతోంది. అవసరాల శ్రీనివాస్ డైరక్షన్లో సినిమా మొదలయింది. ఇంకా మరో రెండు ప్రాజెక్టులు స్టార్ట్ కావాల్సి వుంది.
ఇదిలావుంటే అవసరాల శ్రీనివాస్ డైరక్షన్ లో తయారవుతున్న సినిమాకు ఓ డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేసారు. ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి అన్నది టైటిల్. క్లాస్ ఫన్, ఎంటర్ టైన్ మెంట్ కు అవసరాల శ్రీనివాస్ పెట్టింది పేరు. టైటిల్ ఇలా వుందీ అంటే కచ్చితంగా మళ్లీ తనదైన స్టయిల్ లోనే అవసరాల మరో సినిమా అందించబోతున్నారని డిసైడ్ కావచ్చు.
ఇప్పటికే రెండు సినిమాలు శౌర్యతో అవసరాల అందించారు. ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద అంటూ సినిమా పాటల టైటిళ్లు పెట్టిన ఆయన ఈసారి మాత్రం ఇలా డిఫరెంట్ టైటిల్ ఎంచుకున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది.