సినీనటి పూనమ్ కౌర్, సినిమాల్లో సాధించిన పేరు ప్రఖ్యాతులు పెద్ద ఎక్కువేమీ కాకపోయినా.. ఆమెకి ఇతరత్రా వివాదాలతో బోల్డంత పాపులారిటీ వచ్చిపడింది. కొన్నాళ్ళ క్రితం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిందామె. అప్పట్లో అదో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత పవన్‌కళ్యాణ్‌తో ఆమెకు 'ఎఫైర్' అంటూ మరో గాసిప్ పుట్టుకొచ్చింది. క్షుద్రపూజలనీ ఇంకోటనీ.. పూనమ్ కౌర్ – పవన్ చుట్టూ జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.
పవన్ – పూనమ్ మధ్య దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చిచ్చుపెట్టాడంటూ మరో గాసిప్ తెరపైకొచ్చింది. ఈ గాసిప్స్ సంగతేమోగానీ, పూనమ్ కౌర్ పేరు మరోమారు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. పూనమ్ కౌర్ ఆడియో టేప్.. అంటూ ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అది పూనమ్ కౌర్ ఆడియో.. అంటూ శ్రీరెడ్డి కన్‌ఫామ్ చేసేసింది కూడా. అయితే ఈ వ్యవహారంపై పూనమ్ కౌర్ ఇప్పటిదాకా స్పందించలేదు.
'మా' ఎన్నికల గురించీ, ఇతరత్రా విషయాల గురించీ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో స్పందిస్తూ వస్తోంటే, ఆమెని పవన్ అభిమానులతో కొందరు 'ఆడియో టేప్‌పై స్పందించమని' కోరుతున్నారు. మరికొందరైతే, పవన్‌కళ్యాణ్ జాతకం బయటపెట్టాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇదిలావుంటే, ఎన్నికల సమయంలో పవన్‌కళ్యాణ్ మీదకి పూనమ్ కౌర్ అనే అస్త్రాన్ని 'రాజకీయ ప్రత్యర్థులు' ప్రయోగించబోతున్నారనీ, ఈ క్రమంలోనే ఆడియో టేపు తెరపైకి వచ్చిందనీ ఇంకో ప్రచారం జరుగుతోంది.
మరి, ఈ వివాదంపై పూనమ్ నిజంగానే స్పందిస్తుందా.? ఆడియో టేపులో 'పవన్ ఇమేజ్‌ని దెబ్బతీయాలనుకునేదాన్ని కాదు నేను.. ఆయన్ని ఇష్టపడుతున్నాను.. ఆయనకు నష్టం కలిగించను. నా కుటుంబంలోనూ ఆయన కారణంగా కలతలు వచ్చినా, నేనెప్పుడూ ఆయన్ని ఏమీ అనలేదు..' అని పూనమ్ పేర్కొన్నట్లుగా వున్న ఆ ఆడియో అసలు కథ ఎప్పుడు తేలుతుంది.? వేచి చూడాల్సిందే.