‘లక్ష్మీస్’ కు హోల్ సేల్ ఆఫర్?

లక్ష్మీస్ ఎన్టీఆర్. టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో మాంచి క్రేజ్ తెచ్చుకున్న సినిమా. విడుదల తరువాత ఎలా వుంటుంది? ఆర్జీవీ కంటెంట్ ఏ మేరకు ప్రచారానికి దీటుగా వుంటుంది. అవన్నీ పక్కన పెడితే విడుదలకు…

లక్ష్మీస్ ఎన్టీఆర్. టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో మాంచి క్రేజ్ తెచ్చుకున్న సినిమా. విడుదల తరువాత ఎలా వుంటుంది? ఆర్జీవీ కంటెంట్ ఏ మేరకు ప్రచారానికి దీటుగా వుంటుంది. అవన్నీ పక్కన పెడితే విడుదలకు ముందు మాత్రం మాంచి బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే అవుట్ రేట్ గా వరల్డ్ వైడ్ థియేటర్ రైట్స్ ను 8 కోట్లకు ఇచ్చేసారు. అయితే లేటెస్ట్ గా మరో హోల్ సేల్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఈ డిష్షషన్లలో ఆర్జీవీ బిజీగా వున్నారు. ముంబాయికి చెందిన ఎమ్ హెచ్ స్టూడియోస్ అనే పార్టీ లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రొడక్ట్ అను అవుట్ రేట్ టోటల్ రైట్స్ తీసుకుంటామని ముందుకు వచ్చింది. అయితే వాళ్లు ఎంత ఆఫర్ చేసారన్న పిగర్ బయటకు రాలేదు. ఫ్రస్తుతం ఇందుకోసం ముంబాయి వెళ్లిన ఆర్జీవీ ఆ డీల్ ఫైనల చేసుకుని, రేపు హైదరాబాద్ కు వస్తారు.

సెన్సారు కార్యక్రమం ఒకటి రెండు రోజుల్లో ఫినిష్ అయ్యాక అగ్రిమెంట్లు వుండే అవకాశం వుంది. ఇప్పటికే వదిలిన రెండు ట్రయిలర్లు విపరీతంగా ట్రెండింగ్ అయ్యాయి. సినిమా ఎలా వున్నా సరే,  ఓపెనింగ్స్ కుమ్ముతాయని ట్రేడ్ వర్గాల బోగట్టా. ప్రస్తుతం థియేటర్లలో సినిమాలు కూడా లేవు.

పైగా రాజకీయ వాతావరణం అలుముకుంది. అందువల్ల లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ఇవన్నీ ప్లస్ అవుతాయని భావిస్తున్నారు.

నన్ను ఏమైనా చేసినా డైరెక్ట్ సినిమా అందులోనే..