టెన్షన్ పెట్టిన జెర్సీ యూనిట్

మహర్షి చలవతో మిగతా సినిమాల రిలీజ్ డేట్స్ అన్నీ గందరగోళంలో పడ్డాయి. ఎప్పుడు ఏ సినిమా వాయిదా పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద అనిశ్చితి కనిపిస్తోంది. ఇలాంటి టైమ్ లో అనవసరంగా…

మహర్షి చలవతో మిగతా సినిమాల రిలీజ్ డేట్స్ అన్నీ గందరగోళంలో పడ్డాయి. ఎప్పుడు ఏ సినిమా వాయిదా పడుతుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద అనిశ్చితి కనిపిస్తోంది. ఇలాంటి టైమ్ లో అనవసరంగా కంగారు పెట్టేసింది జెర్సీ సినిమా యూనిట్.

ఏప్రిల్ 19న జెర్సీ సినిమాను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు అఫీషియల్ పోస్టర్లు కూడా వచ్చేశాయి. దీంతో జెర్సీకి ముందు మజిలీ, చిత్రలహరి సినిమాలు.. జెర్సీ తర్వాత సీత, మహర్షి సినిమాలు ఫిక్స్ అయ్యాయి. అంతా సెట్ అయిందనుకునే టైమ్ కు బాంబ్ పేల్చింది జెర్సీ యూనిట్. తమ సినిమా ఏప్రిల్ 29న థియేటర్లలోకి రాబోతున్నట్టు ప్రకటించింది.

19న కాకుండా.. 29కి సినిమా వస్తుందంటూ మీడియాకు ప్రెస్ నోట్లు కూడా వెళ్లిపోయాయి. దీంతో అంతా అవాక్కయ్యారు. అప్పుడే కొన్ని సైట్స్ లో జెర్సీ రిలీజ్ వాయిదా అంటూ స్టోరీలు కూడా వచ్చేశాయి. నిర్మాతలు పీడీవీ ప్రసాద్, నాగవంశీకి వరుసపెట్టి కాల్స్ వెళ్లాయి. దీంతో అసలు తప్పు ఎక్కడ జరిగిందో యూనిట్ గ్రహించింది.

వెంటనే మీడియాకు ఇచ్చిన ప్రెస్ నోట్ ను ఉపసంహరించుకున్నారు. ఇంతకుముందు చెప్పినట్టుగా ఏప్రిల్ 19కే సినిమా థియేటర్లలోకి వస్తుందని కొత్తగా మరో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇలా కారణం లేకుండా అందర్నీ టెన్షన్ పెట్టింది జెర్సీ యూనిట్.

నన్ను ఏమైనా చేసినా డైరెక్ట్ సినిమా అందులోనే..