Advertisement

Advertisement


Home > Politics - Analysis

జగన్ ఆ ఒక్కటీ చేసి వుంటే..!

జగన్ ఆ ఒక్కటీ చేసి వుంటే..!

జనాల అకౌంట్లలోకి వివిధ పథకాల ద్వారా నేరుగా డబ్బులు వేయడం అన్నది, అది కూడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, తర తమ బేధాలు లేకుండా లబ్దిదారులను ఎంపిక చేసి ఇవ్వడం అన్నది ఆంధ్ర సిఎమ్ జగన్ సాధించిన పెద్ద అచ్యూవ్ మెంట్. ఈ ఎన్నికల్లో పూర్తి భరోసా పెట్టుకున్నది కూడా ఆ పథకాల మీదే.

అయితే జనాల గురించి ఇంతలా పట్టించుకున్న జగన్, ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కేర్ తీసుకోలేదు. అలా అని వాళ్లకు జీతాల బకాయి ఏమీ లేదు. అయిదేళ్లకు సంబంధించి ఒక్క నెల జీతం కూడా బకాయి లేదు. అలాగే ఒక్క నెల పింఛను బకాయి లేదు. అంతవరకు మెచ్చుకోదగ్గ సంగతే.

కానీ ఎప్పటికప్పుడు డిఎలు ఇవ్వడం, పే రివిజన్ వంటి విషయాల్లో జగన్ ఎందుకో సీరియస్ గా తీసుకోలేదు. అలాగే అవసరం పడిన నిధుల కోసం పిఎఫ్ ఖాతాలో మొత్తాలను ప్రభుత్వం వాడుకోవడం అన్నది ఉద్యోగులను కలవరపాటుకు గురి చేస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగులు అంటే దాదాపు 20 లక్షల ఓట్లు. కనీసం యాభై శాతం ఓటింగ్ పడినా పది లక్షల ఓట్లు అంటే చిన్న విషయం కాదు. అలా అని ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు మీద ప్రేమ ఏమీ లేదు. చంద్రబాబు గతంలో రెండు మూడు సార్లు ఓడినపుడల్లా అందులో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర వుంది. కానీ ఇప్పుడు జగన్.. చంద్రబాబు అంటే ఉద్యోగులు ఎటు నిర్ణయించుకుంటారు.

ఇంగ్లీష్ మీడియం, ఆన్ లైన్ హాజరు ఇలాంటివి జగన్ అంటే టీచర్లకు కాస్త ఆగ్రహం తెప్పించాయి. నిజానికి ఇవి మంచి విషయాలనే. కానీ ప్రభుత్వ ఉద్యోగులు కదా, తాము ప్రభుత్వ దత్త పుత్రులు అనుకుంటూ వుంటారు. తమను ఆన్ లైన్ హాజరు వేయమంటారా? ఇంగ్లీష్ పాఠాలు చెప్పమంటారా? అని ఆగ్రహం.

జనాలకు డబ్బులు ఇబ్బడి ముబ్బడిగా ఇచ్చిన జగన్, ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ బకాయిలు అన్నీ ఇచ్చేసి వుంటే సరిపోయేది. అలాగే పనిలో పనిగా పిఆర్సీ విషయంలో తగిన చర్యలు తీసుకోవాల్సింది. చంద్రబాబు నా, జగన్ నా ఎవరు బెటర్ అనే ఆప్షన్ ను తీసుకోవాల్సి వస్తే, ఉద్యోగులు జగన్ వైపే మెగ్గేవారు కచ్చితంగా. కానీ ఇప్పుడు కాస్త ముందు వెనుకలాడుతున్నట్లు కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?