మరో మూడు రోజులు విద్యాసంస్థలకు సెలవు పొడిగింపు.!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు మరో మూడు రోజులు సెలవులు ప్రకటించింది. వర్షాల కారణంగా వాగులు వరదలు పొంగి పొందుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో నేడు ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. Advertisement…

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు మరో మూడు రోజులు సెలవులు ప్రకటించింది. వర్షాల కారణంగా వాగులు వరదలు పొంగి పొందుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ లో నేడు ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.

తెలంగాణలో గడిచిన ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మూడురోజుల పాటు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అయితే నేటితో ఆ గడువు ముగుస్తుంది. 

బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం వాయుగుండంగా మారి బలపడటంతో మరో రెండు లేదా మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. దీని కారణంగా  ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో రెడ్, ఆరంజ్ అలెర్ట్ ప్రకటించింది.

ఇలాంటి సమస్యనైనా ఎదుర్కొనేలా సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశాలు. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకి రావద్దన్నారు. వరంగల్, నల్గొండ, సూర్యాపేట, తుంగతుర్తి, మహబూబ్ నగర్, జనగాం ప్రాంతాల్లో పరిస్థితిని గురించి ఆరా తీశారు. 

జిహెచ్ఎంసి, పోలీస్ అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. వర్షాల కారణంగా ప్రభులే సీజనల్ వ్యాధుల గురించి ఆరోగ్యశాఖ పూర్తి దృష్టి సాధించాలన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తమ నియోజకవర్గంలో వుండి క్షేత్రస్థాయిలో పరిస్థితులను గురించి సమీక్షించాలని కోరారు.