కరోనా అనేది విపత్తు. ఇలాంటి సందర్భాల్లో కుత్సిత రాజకీయాలు చేసేవాళ్లు బుర్ర లేకుండా వ్యవహరిస్తే వారు ఆశించే రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయా లేదా అనేది వేరే సంగతి. కానీ దేశ ప్రయోజనాలు జాతి ప్రయోజనాలు మాత్రం దెబ్బతింటాయి. సాధారణ రోజుల్లో ఎన్ని వక్ర రాజకీయాలు చేసినా.. అంతో ఇంతో ప్రజల గురించిన స్పృహ ఉండే నాయకులకు ఈ నీతి చక్కగా తెలుసు. ఆ మాత్రం విచక్షణ ఉంటే.. లోకేష్ ఎందుకవుతాడు? అందుకే లోకేష్ తలాతోకా లేని విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా లోకేష్ ఓ ట్వీటు పెట్టారు. రాజమండ్రి సమీపంలో ఏర్పాటుచేసిన క్వారంటైన్ కేంద్రంలో కొందరు యువత ఉండిపోయారు. తమకు పరీక్షలు నిర్వహించి.. కరోనా సోకలేదని తేల్చినట్లు వారు చెబుతూ ఓ వీడియో తీశారు. అయినా సరే తమను క్వారంటైన్ లో ఉంచారని, తక్షణం తమను ఇంటికి పంపాలనేది ఆ వీడియోలో వారి డిమాండు. ఆ క్వారంటైన్ కేంద్రంలో భోజనాలు సరిగా లేవనేది మరో డిమాండ్. పనిలో పనిగా ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుతోంటే.. వెనుకనుంచి యువకులంతా కలిసి పెద్దపెట్టున సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం కూడా ఆ వీడియోలో ఉంది. ఈ నినాదాల సహా వీడియో మొత్తం చూసేసరికి నారా లోకేష్ కు బహుశా విందుభోజనం చేసినంత మహదానందంగా అనిపించి ఉండొచ్చు. అందుకే ఆయన ఆ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. క్వారంటైన్ లో ఉన్నవారికి మెరుగైన సదుపాయాలు, మంచి భోజనం అందించాలంటూ జగన్మోహనరెడ్డి ప్రభుత్వానికి లోకేష్..హితోపదేశం కూడా చేశారు.
సోమిరెడ్డి, వర్ల రామయ్య లాంటి వాళ్లు తప్ప.. మరీ ఇంత కనీస విచక్షణ లేని మాటలు ఈ కరోనా సీజన్లో ఎవరూ మాట్లాడడం లేదు. కరోనా సోకలేదని పరీక్షల్లో తేలినంత మాత్రాన వారిని వెంటనే ఇళ్లకు పంపడం కుదర్దు, సోకితే చికిత్స అందిస్తారు. సోకలేదని కన్ఫర్మ్ అయి.. సోకవచ్చుననే అనుమానం ఉన్నప్పుడు కొన్ని రోజులు క్వారంటైన్ లో ఉంచుతారు. ఆ కనీసజ్ఞానం కూడా లేకుండా.. ఆ యువకులు మాట్లాడవచ్చు గాక. కానీ వారి వీడియోను లోకేష్ ట్వీట్ చేయడమే బాధాకరం.
జగన్ ను డౌన్, డౌన్ అన్నటువంటి యువకుల వీడియోను తాను ట్వీట్ చేస్తే.. తనకు మైలేజీ వచ్చేస్తుందని లోకేష్ అనుకున్నాడో ఏంటో ఖర్మ. ఇలాంటి సమయాల్లో నాయకులకు విచక్షణ ఉంటే.. ఆ యువతకే బుద్ది చెప్పాలి. పోలీసులకు మీమీద వ్యక్తిగత కక్షలుండవు. వారికి సహకరించండి. వారి అనుమతి లేకుండా ఇళ్లకు వెళ్లిపోయి మీ కుటుంబసభ్యులను కూడా ప్రమాదంలోకి నెట్టవద్దు అని చెప్పాలి. అంత విచక్షణ ఉంటే.. ఆయనను లోకేష్ అని ఎందుకంటారు?