మన్యం జనమే చాలా బెటర్!

మనం తెలివి ఎక్కువైదందని తెగ ఫీల్ అవుతూంటాం. మరి బుర్రలో ఎంత మట్టి ఉందో ఎవరికీ తెలియదు. అతి తెలివితోనే అమెరికా ఈ రోజు మహా విలయాన్ని చవిచూస్తోంది. మారుమాటాడకున్నా, మేధావులమని చెప్పకున్నా మన్యం…

మనం తెలివి ఎక్కువైదందని తెగ ఫీల్ అవుతూంటాం. మరి బుర్రలో ఎంత మట్టి ఉందో ఎవరికీ తెలియదు. అతి తెలివితోనే అమెరికా ఈ రోజు మహా విలయాన్ని చవిచూస్తోంది. మారుమాటాడకున్నా, మేధావులమని చెప్పకున్నా మన్యం జనం మాత్రం ఇలాంటి విషయాల్లో బాగానే ఉంటారని, పట్నం వాసులకంటే ముందే మేలుకుంటారని అనేకసార్లు రుజువు అయింది.

తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వాల కన్నా, ప్రసార సాధనాల హిత వచనాల కన్నా ముందే మన్యం గిరిజనులు  మేలుకుని అవగాహన పెంచుకున్నారు. వారు ఈ మహమ్మారి విషయంలో తమదైన శైలిలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

బయట వారిని తమ వైపు రానీయకుండా విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలోని వివిధ  గ్రామాల జనం ఎక్కడికక్కడ దడులను  కట్టుకున్నారు. అంతే కాదు, తమలో తాము సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు.

ఇక మాస్కుల విషయంలో వారు తమకు తామే తయారు చేసుకుంటున్నారు. పచ్చని చెట్ల ఆకులతో తయారు చేసిన సంప్రదాయబధ్ధమైన మాస్కులతో వారు తమ ప్రాణాలను కాపాడుకుంటున్నారు.

ఔషధ  సంపత్తి పూర్తిగా కలిగిన ఆకులతో తయారు చేసిన  మాస్కులతో వైరస్ అసలు రాకుండా ఉంటుంది. పైగా ఇవి ఎప్పటికపుడు మార్చుకుంటూ కొత్తవి తయారుచేసి పెట్టుకోవడం ద్వారా విశాఖ పరిసరాల గిరిజనం తమకు తామే సాటి అని చెబుతున్నారు.

ఇక మన్యంలో అసలే వైద్య సదుపాయలు ఉండవు, దాంతో వారంతట వారే వైరస్ నుంది తమను ఇలా రక్షించుకుంటున్నారు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా మన్యంలో వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు చేపడుతోంది. అక్కడ పది వరకూ క్వారంటైన్స్ వార్డులను ఏర్పాటు చేస్తోంది.

ఏప్రిల్ 7వ తేదీకి కేసులన్నీ ఖతం

క‌రొనా పై చిరు-నాగ్ పాట చూశారా?