ఎంత శాతం షూటింగ్ పూర్తయిందనే విషయాన్ని పక్కనపెడితే.. చరణ్-శంకర్ సినిమా మాత్రం నడుస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ఈ సినిమా షెడ్యూల్స్ కొనసాగుతున్నాయి. హైదరాబాద్, రాజమండ్రి, పూణె, రాజస్థాన్.. ఇలా రకరకాల లొకేషన్లలో షూటింగ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడు? సినిమా టైటిల్ ప్రకటన ఎప్పుడు?
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఫస్ట్ లుక్ రెడీ అయింది. షెడ్యూల్స్ గ్యాప్ లోనే ఫస్ట్ లుక్ కు సంబంధించిన ఫొటో షూట్ కూడా పూర్తి చేశాడు శంకర్. ఓ లుక్ కూడా లాక్ చేశారు. అయితే దాన్ని కావాలనే రిలీజ్ చేయలేదు.
నిర్మాత దిల్ రాజు, ఎఫ్3 ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఓ మంచి రోజు చూసి శంకర్-చరణ్ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. ఎఫ్3 థియేటర్లలోకి వచ్చిన వెంటనే #RC15 ఫస్ట్ లుక్ ఎనౌన్స్ మెంట్ రాబోతోంది.
అయితే ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. 2-3 టైటిల్స్ అనుకున్నప్పటికీ ఏదీ ఫైనలైజ్ కాలేదు. తమిళ్ వెర్షన్ కు శంకర్ ఓ టైటిల్ అనుకున్నారు. కానీ అది తెలుగు వెర్షన్ కు సింక్ అవ్వడం లేదు. అన్ని భాషల్లో (హిందీతో కలిపి) ఒకే టైటిల్ పెట్టాలనేది దిల్ రాజు ఆలోచన.
కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో చరణ్ కు చెందిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మరో హీరోయిన్ గా అంజలి కనిపించనుంది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.