చిరును ఇంటర్వ్యూ చేయబోతున్న చరణ్

సైరా విడుదలకు ఇంకా చాలా టైం ఉంది. అప్పుడే ప్రచారం ప్రారంభించాల్సిన అవసరం లేదు. కానీ యూనిట్ మాత్రం హడావుడిగా ఓ ప్రమోషనల్ ఈవెంట్ ప్లాన్ చేసింది. చిరంజీవిని కూర్చోబెట్టి ఓ ఇంటర్వ్యూ వదలాలని…

సైరా విడుదలకు ఇంకా చాలా టైం ఉంది. అప్పుడే ప్రచారం ప్రారంభించాల్సిన అవసరం లేదు. కానీ యూనిట్ మాత్రం హడావుడిగా ఓ ప్రమోషనల్ ఈవెంట్ ప్లాన్ చేసింది. చిరంజీవిని కూర్చోబెట్టి ఓ ఇంటర్వ్యూ వదలాలని భావిస్తున్నారు. సైరా మేకింగ్, సినిమా అప్ డేట్స్, బడ్జెట్, స్టోరీలైన్.. ఇలా అన్నీ కవర్ అయ్యేలా ఆ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారు.

ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవిని ఇంటర్వ్యూ చేసేది యాంకర్ కాదు. స్వయంగా చిరు తనయుడు, సైరా నిర్మాత రామ్ చరణ్.. చిరంజీవిని ఇంటర్వ్యూ చేస్తాడట. అలా ఓ స్పెషల్ ఇంటర్వ్యూను అతిత్వరలో మార్కెట్లోకి తీసుకురావాలని సైరా యూనిట్ భావిస్తోంది.

ఈ టైమ్ లో ఇలా సైరా యూనిట్ నుంచి ఓ ఇంటర్వ్యూ ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. కానీ దీనివెనక సినిమా ప్రచారం కంటే, మార్కెట్ వ్యూహం ఎక్కువగా కనిపిస్తోంది. అవును.. సైరా బిజినెస్ ను ఇంకాస్త పెంచేందుకు ఇలా చిరంజీవితో వ్యూహాత్మకంగా ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడు రామ్ చరణ్.

నిజానికి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం చాన్నాళ్లుగా ఛానెళ్లతో చర్చలు సాగుతున్నాయి. పేరుకు ఇది మెగాస్టార్ సినిమానే అయినప్పటికీ చరణ్ చెబుతున్న కోట్లు ఇవ్వడానికి ఛానెళ్లు ముందుకురావడం లేదు. అటు ఓవర్సీస్, డబ్బింగ్ రైట్స్ విషయంలో కూడా ఇలాంటి ప్రతిబంధకాలే ఎదురవుతున్నాయి.

అందుకే మూవీకి మార్కెట్ పరంగా మరింత హైప్ ఇచ్చేందుకు ఈ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారట. ఈ ఇంటర్వ్యూ తర్వాత మరోసారి ఫ్రెష్ గా బిజినెస్ డీల్స్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట.

దాంపత్యంలో ఆనందం.. ఆ మాటతోనే సాధ్యమట!