నాకు ఆడవాళ్లు అంటే ప్రత్యేకమైన అభిమానం కానీ ప్రత్యేకమైన గౌరవం కానీ ప్రత్యేకమైన ద్వేషం కానీ ఉండవు… ఒక మగాడిగా వారి పట్ల ప్రకృతి సహజమైన ఆకర్షణ… ప్రేమ… కోపం విరోదం… శతృత్వం… దాతృత్వం… ఇవన్నీ ఉంటాయి.
ప్రత్యేకం… ప్రత్యేకం…. ప్రత్యేకం…. అసలు దేనికీ “ప్రత్యేకం”… ఈ “ప్రత్యేకం” అనేది ఒక సానుభూతిలా అనిపిస్తుంది ఈ “ప్రత్యేకత” తోనే వాళ్ల శక్తిని తక్కువ చేసి చూస్తున్నాము అనిపిస్తుంది..
ఒకసారి ఆఫీసులో రిసెప్షనిస్టుతో గొడవపడ్డా.. అందరూ.. ఆడవాళ్ళతో నీకు గొడవేంటీరా.. అంటూ ఉంటే… అప్పుడు నాకు ఇంత మానసిక పరిపక్వత లేదు.. అయినా కూడా అప్పట్లోనే అనిపించింది ఆడవాళ్లు అయితే పొట్లాడకూడదు అంటే వాళ్లు అంత తక్కువా?.. ఎందుకు వాళ్లని అంత ప్రత్యేకంగా చూడాలి?… ఆడవాళ్లు అయినంత మాత్రాన వాళ్లు ఎమైనా అనొచ్చా ఆడవాళ్లు అనేది అదేమైనా లైసెన్సా.. అలాగే అవతల వాళ్లు .. ఆడవాళ్లు అయినంతమాత్రాన మగ మహారాజులు ఎమైనా కుయ్యవచ్చా? ఆసలెంటీ? వాళ్లని మనతో సమానంగా కాదు ఒక శక్తిహీనురాలు ఒక బలహీనురాలు అనే కదా మన అభిప్రాయం…
వాళ్లని ప్రత్యేకంగ ఎందుకు గౌరవించాలి?
ప్రత్యేకంగా ఎందుకు ద్వేషించాలి?
ప్రత్యేకంగా దేనికి సానుభూతి చూపించాలి..?
ఒక మనిషి మంచి చెస్తే ఎలా అభిమానిస్తాం ఒక మనిషి తప్పు చెస్తే ఎలా దండిస్తాం అలా ఎందుకు ఉపెక్షించాలి వాళ్లు దేనిలో తక్కువ… దేనిలో ఎక్కువ? ఒక మగాడిగా సిగ్గులేకుండా గర్వంగా చెప్తున్న ఒక్కదానిలో వాళ్లు లేరు అని చెప్పండి… మగాడు సాధించే అన్ని ఉన్నతమైన రంగాలలో ఉన్నారు.
చివరికి మగాళ్ళుకి ఉన్న వ్యసనాలలో కూడా… ఒక్క మగాళ్లే నా మేము కూడా ఎంజాయ్ చేస్తాం అని అందులో కూడా కొంతమంది పోటీపడుతున్నారు… ఎందుకంటే అమె కూడా రక్త మాంసాలు ఉన్న అందరి లాంటి మట్టి ముద్దే కోపాలు తాపాలు శాంతాలూ అమెకూ మామూలే…. ఎందుకు ఈ ప్రత్యేక దినాలు పేరుతో ఇంకా ఇంకా వాళ్లని తొక్కుతున్నాం అనిపిస్తూ ఉంటుంది…
కొస మెరుపు… నన్ను కన్నది బాగు చేసింది ఉద్దరించిందీ మహిళే…
నన్ను ఎక్కువగా అభిమానించేది మహిళలే….
నేను ఎక్కువ గొడవలు పడింది కూడా సోషల్ మీడియాలో మహిళలతోనే…
ఎందుకంటే అమె నా దృష్టిలో కన్న తల్లి…
ప్రేమను పంచే
అక్క,
చెల్లీ.
ప్రియురాలు…
భార్యా
స్నేహితురాలు
నా శత్రువు
నా విరొధీ
నా శ్రేయోభిలాషి
..నా గురువు
అన్నీ నాకు అమెనే….
అమె లేని లోకంలో నేను ఒక్క నిమిషం కూడా ఉండలేను….
ఇక ముందు ముందు అమె కోసం ఈ ప్రత్యేక దినాలు మానుకుందాం..
…జై మహిళ జై జై మహిళ
-మీగడ త్రినాధరావు