`సుచీ లీక్స్` పేరు వింటే దక్షిణాది చిత్రపరిశ్రమ హడలి చచ్చేది. కొన్నేళ్ల క్రితం ప్రముఖ గాయని సుచిత్ర పేరు మీద జరిగిన `సుచీ లీక్స్` దక్షిణాదిలో ఎన్నో వివాదాలు సృష్టించింది. అప్పట్లో `సుచీ లీక్స్` గురించి కథలు కథలుగా చర్చించుకునే వాళ్లు. మీడియాకైతే కావాల్సినంత మసాలా.
మరీ ముఖ్యంగా దక్షిణాదిలో తమిళ చిత్రపరిశ్రమలోని ప్రముఖుల బండారాలు సుచీలీక్స్ పుణ్యమా అని బయటపడ్డాయి. ఈ సుచీలీక్స్ ద్వారా ప్రముఖ హీరోయిన్స్ త్రిష, అమలాపాల్, గాయని ఆండ్రియాతో పాటు ధనుష్, అనిరుధ్, రానా తదితరుల వ్యక్తిగత ఫొటోలు వెలుగు చూశాయి. దీంతో చిత్రపరిశ్రమలో అలజడి చెలరేగింది.
సుచీలీక్స్ ద్వారా బయటపడిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, గాయని, నటి ఆండ్రియా లిప్‌లాక్ ఫొటోలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. నాటి సంగతులు ఆండ్రియాను మాత్రం నీడలా వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ ఫొటోల గురించి ఆండ్రియా మాట్లాడింది.
`అవి చాలా కాలం క్రితం తీసిన ఫోటోలు. మా మధ్య అప్పట్లో అలాంటి బంధం ఉంది. ఆ విషయమై ఎందుకు దాచాలి? అయితే, వ్యక్తిగతంగా ఉండాల్సిన కొన్ని బహిరంగం కావడమే బాధగా ఉంది. లిప్‌లాక్ గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అందులో తప్పేం ఉంది. ఆ ఫొటోలు లీక్ కావడమే తప్పు. అందుకే ఆ తర్వాత అనిరుధ్ నాకు సారీ చెప్పాడు` అని ఆండ్రియా చెప్పింది. గతంలో ఆండ్రియా, అనిరుధ్ పీకల్లోతూ ప్రేమలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకుని ఎవరి బతుకు వాళ్లు బతుకుతున్నారు.