మళ్ళీ వస్తు మార్పిడి విధానం!

అపుడెపుడో అంటే రూపాయిలు, కాసులు, నాణేలు లేని రోజుల్లో వస్తు మార్పిడి విధానం ఉండేదని అంతా విన్నారు. వినడమేంటి చరిత్రలో  కొన్ని శతాబ్దాల క్రితం ప్రతీ వారూ  చదువుకున్నారు. ఒకరి వద్ద ఉన్న వస్తువులు…

అపుడెపుడో అంటే రూపాయిలు, కాసులు, నాణేలు లేని రోజుల్లో వస్తు మార్పిడి విధానం ఉండేదని అంతా విన్నారు. వినడమేంటి చరిత్రలో  కొన్ని శతాబ్దాల క్రితం ప్రతీ వారూ  చదువుకున్నారు. ఒకరి వద్ద ఉన్న వస్తువులు వేరొకరికి ఇచ్చిన తమకు అవసరం అయిన వాటిని తీసుకునేవారని చరిత్ర చెబుతోంది.

మళ్ళీ ఆ చరిత్రను తిరగరాసే రోజులు వచ్చాయి. కరోనా వైరస్ కారణంగా ఎవరూ ఎక్కడికీ తిరగలేకపోతున్నారు. చేతిలో చిల్లిగవ్వ ఆడడంలేదు. దాంతో విశాఖలోని శివారు గ్రామాల ప్రజలు మళ్ళీ వస్తు మార్పిడి విధానమే శరణ్యమని అంటున్నారు.

విశాఖ శివారు ప్రాంతమైన చినగదిలిలో వస్తువులను ఇచ్చి పుచ్చుకుంటూ స్థానికులు తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. తమ దగ్గర ఉన్న వాటిని ఇతరులకు పంచడం, వారి వద్ద ఉన్న సరుకులు తాము తీసుకోవడం ద్వారా ఈ ఆపత్కాలాన్ని గట్టెక్కుతున్నట్లుగా ఇక్కడి ప్రజలు చెబుతున్నారు.

ఏటీఎంలు వెక్కిరిస్తున్నాయి. డబ్బులు లేవు. మరో వైపు కరెన్సీ ద్వారా కూడా కరోనా అంటువ్యాధిలా సోకుతుందని తెలుస్తున్న ఈ తరుణంతో ఇంతకు మించి తరుణోపాయం లేదని పలువురు అంటున్నారు. ఈ విధంగా నిత్యావసరాలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామని వారు అంటున్నారు. మొత్తం మీద ఇదేదో బాగున్నట్లుగానే ఉందిపుడు.

దీన్ని మిగిలిన ప్రాంతలా వారు కూడా ఆచరించేందుకు ముందుకువస్తున్నారు. అంటే మళ్ళీ మనం పురాతన రోజులను గుర్తు చేసుకోవాల్సిందే. పైగా ఈ ఇచ్చిపుచ్చుకోవడంలో ఎంతో ఆనందం, ఆప్యాయత కూడా ఉందని అంటున్నారు.

క‌రొనా పై చిరు-నాగ్ పాట చూశారా?

ఏప్రిల్ 7వ తేదీకి కేసులన్నీ ఖతం