మోహన్ బాబు కూతుర్ని అని కూడా చూడట్లేదు

మోహన్ బాబు అప్పుడప్పుడు ఎలా ఫైర్ అవుతుంటారో చూస్తూనే ఉన్నాం. సెట్స్ లోనే కాదు, పరిశ్రమకు చెందిన కొన్ని ఇష్యూస్ పై కూడా ఒక్కోసారి ఉగ్రరూపంలో కనిపిస్తుంటారాయన. ఇప్పుడా బాధ్యతను ఆమె కూతురు మంచు…

మోహన్ బాబు అప్పుడప్పుడు ఎలా ఫైర్ అవుతుంటారో చూస్తూనే ఉన్నాం. సెట్స్ లోనే కాదు, పరిశ్రమకు చెందిన కొన్ని ఇష్యూస్ పై కూడా ఒక్కోసారి ఉగ్రరూపంలో కనిపిస్తుంటారాయన. ఇప్పుడా బాధ్యతను ఆమె కూతురు మంచు లక్ష్మీ తీసుకున్నారు. తన సినిమాలకు థియేటర్లు దొరకడం లేదంటూ ఆరోపించారు మంచు లక్ష్మి.

“రాత్రిపగలు కష్టపడి, రక్తం ధారపోసి సినిమా చేశాం. కుటుంబాల్ని వదిలేసి పనిచేస్తాం. ఏదో సినిమా వస్తుందని మా సినిమా పీకేస్తున్నారు. చాలా హర్ట్ అయ్యాను. పెద్ద-చిన్న అని చూడరు. ఐదారుగురి చేతిలో ఉన్నాయి థియేటర్లన్నీ. అడిగేవాళ్లు లేరిక్కడ. మోహన్ బాబు కూతురు సినిమా కాబట్టి ఓ వారం రోజులైనా థియేటర్లలో ఉంచుదామనే ఆలోచన కూడా చేయరు. అలాంటి మొహమాటాలు పడరు.”

ఇలా థియేటర్ల మాఫియాపై ఫైర్ అయ్యారు మంచు లక్ష్మి.  మిసెస్ సుబ్బలక్ష్మి అనే వెబ్ సిరీస్ లాంఛ్ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఆమె ఇలా ఫైర్ అయ్యారు. తను నటించిన ఎన్నో మంచి సినిమాల్ని అకారణంగా థియేటర్ల నుంచి తొలిగించారని ఆరోపించిన ఆమె.. కేవలం ఐదారుగురు చేతుల్లో థియేటర్లన్నీ చిక్కుకుపోయాయని ఆరోపిస్తున్నారు. 

తను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో పాత్రలన్నీ వేటికవే విభిన్నమైనవని.. వాటికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు మంచు లక్ష్మి. తనకు కావాల్సిన అవార్డులన్నీ వచ్చేశాయని.. ఇకపై తన ఆనందం కోసమే పనిచేస్తానంటున్న మంచు లక్ష్మి.. అందుకే వెబ్ సిరీస్ చేశానంటున్నారు.