ప్రతిపక్షాలకు దూరంగా చంద్రబాబు

2019 కి 2023 కి ఎంత మార్పు. స్పెషల్ ఫ్లయిట్ వేసుకుని తిరిగిన రాష్ట్రం తిరగకుండా, ఇక మోడీ ని పదవి నుంచి కిందకు దింపేసినట్లే అన్నంత హడావుడి చేసిన చంద్రబాబు మాయమయ్యారు.  Advertisement…

2019 కి 2023 కి ఎంత మార్పు. స్పెషల్ ఫ్లయిట్ వేసుకుని తిరిగిన రాష్ట్రం తిరగకుండా, ఇక మోడీ ని పదవి నుంచి కిందకు దింపేసినట్లే అన్నంత హడావుడి చేసిన చంద్రబాబు మాయమయ్యారు. 

మోడీ పట్ల మౌనమే తన భాష అన్నట్లుగా వుండిపోయారు. తాను గత మూడేళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా మోడీ తనను ఇక దగ్గరకు తీయరని దాదాపు క్లారిటీ వచ్చేసినా కూడా చంద్రబాబు ఇదే యోగముద్ర ను పాటిస్తున్నారు.

గతంలో తాను రెచ్చిపోయి, తన లెవెల్ లో రెచ్చగొట్టిన ప్రతిపక్షాలను మరిచిపోయారు. వదిలేసారు. మమత దీదీ అలాగే వున్నారు. తను నమ్మిన సిద్దాంతాల మేరకే. స్టాలిన్ అలాగే మిగిలారు. మిగిలిన వారు డిటో..డిటో. కానీ పాపం చంద్రబాబు మాత్రం మారిపోయారు. 

డీలా పడిపోయారు. 2019 ఎన్నికల్లో భాజపా పరోక్షంగా ఇచ్చిన షాక్ లు మరిచిపోలేకపోతున్నారు. అవే 2023లో మళ్లీ రిపీట్ అవుతాయేమో అని భయం భయంతో ఆచి తూచి అడుగు వేస్తున్నారు.

జగన్ తప్పిదాలను భూతద్దంలో చూస్తూ, మోడీ వ్యవహారాలను అస్సలు పట్టనట్లు ముందుకు సాగిపోతున్నారు. గ్యాస్, పెట్రోలు ధరలు ఎడా పెడా పెరుగుతున్నా బాబుగారు పెదవి విడడం లేదు. 

దేశ ఆర్థిక పరిస్థితి ఎలా వుందో? ద్రవ్యోల్బణం ఎలా పెరుగుతుందో పట్టడం లేదు. ఇంకా చాలా చాలా విషయాల మీద మాట్లాడే ధైర్యం చేయడం లేదు.

తన అభిమాన వెంకయ్య నాయుడును పక్కన పెట్టి భాజపా వేరే రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయిస్తే, ప్రతిపక్షాల అభ్యర్థిని కాదని మద్దతు ప్రకటించడంతో చంద్రబాబు పూర్తిగా మారిపోయారని క్లారిటీ వచ్చేసింది. ఇక ప్రతిపక్షాలు చంద్రబాబును మర్చిపోవచ్చు.