టాలీవుడ్ చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. థియేటర్ ఆదాయం పడిపోతోంది. నాన్ థియేటర్ ఆదాయం పెరుగుతోంది.
కానీ హీరోలు మాత్రం నాన్ థియేటర్ ఆదాయం పెరుగుతోంది. థియేటర్ ఆదాయం అలాగే వుందని భ్రమలో బతికేస్తూ నిర్మాతలను పిండేస్తున్నారు. హీరోలు ఏమైనా వదిలితే ప్రొడక్షన్ కాస్ట్ పెంచేసి డైరక్టర్లు కానిచ్చేస్తున్నారు.
సరే ఇదంతా వేరే సంగతి. ఇంతకీ ఇప్పుడు విషయం ఏమిటంటే నాని హీరోగా నటిస్తున్న దసరా సినిమాకు మాంచి నాన్ థియేటర్ రేట్లు పలికాయి.
డిజిటల్, హిందీ, శాటిలైట్, అడియో అన్నీ కలిపి 47 కోట్ల మేరకు అగ్రిమెంట్లు కుదిరాయి. నిజానికి నాని సినిమా కనుక 50 కోట్లలో ఫినిష్ చేస్తే నిర్మాతకు ధైర్యంగా వుంటుంది. ఎందుకంటే థియేటర్ ఆదాయం ఏమాత్రం వచ్చినా అది లాభంగా మారుతుంది కనుక.
కానీ ఈ సినిమాకు ఖర్చు ఓ రేంజ్ లో జరిగిపోతోందని భోగట్టా. ఓ పాట కోసమే 500 మంది జూనియర్ ఆర్టిస్టులను ఎంగేజ్ చేసారు. సుమారు 2 కోట్లు ఖర్చు చేసేసారు. అలాగే ఓ భారీ ఫైట్ కోసం కూడా కోటికి పైగా ఖర్చు అయిపోయింది.
ఇలా ఖర్చు చేయిస్తుంటే నాన్ థియేటర్ ఎంత వచ్చి ఏం లాభం? థియేటర్ కు జనాలు రావడం లేదని, స్పృహ వుంచుకుని నిర్మాణ వ్యయాన్ని అదుపులో వుంచుకోకపోతే?