డబ్బులు కావాలి, సినిమాలు చేయాలి. కానీ రాజకీయాలు ముఖ్యం..గ్యాప్ దొరికినపుడే సినిమా షూటింగ్. ఇలా ఉంది. పవర్ స్టార్, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ఆలోచనా విధానం.
ఇప్పటికే రెండు సినిమాలు అలా పక్కన పడి వున్నాయి. ఒకటి హరి హర వీర మల్లు. పవన్ కోసం సినిమా మొదలు పెట్టి దర్శకుడు క్రిష్ పాపం, అలా వుండిపోయారు. మరోటి ఇంకా బిగిన్ కాలేదు..కానీ డైరక్టర్ కూడా అలా ముందుకు వెళ్లలేక, వెనక్కుపోలేక వుండిపోయారు. అదే భవదీయుడు భగత్ సింగ్. దర్శకుడు హరీష్ శంకర్.
ఇవి ఇలా వుంచుకనే మరో రీమేక్ కు పచ్చ జెండా ఊపేసారు. సాయి ధరమ్ తేజ్ ను ఎటూ వెళ్లడానికి వీల్లేదు అంటూ మేనమామ హోదాలో హుకుం జారీ చేసారు. జూలై 10 నుంచి డేట్ లు అన్నారు.
కానీ ఇప్పుడేమయింది. జనవాణి కార్యక్రమం, చాతుర్మాస దీక్ష, గుళ్లు, గోపురాలు ఇవన్నీ ప్రయారిటీ అయిపోయాయి.
దాంతో ఆ సినిమా కూడా అలా వెయిటింగ్ లో వుంది. పాపం ఈ సినిమా డైరెక్ట్ చేయాలని నటుడు సముద్రఖని నటుడిగా బోలెడు సినిమాలు చేయాల్సినవి సైతం క్యాన్సిల్ కొట్టారు. దాని వల్ల ఆదాయం పోయింది.
సినిమాలు పోయాయి. ఈ సినిమా ఇలా వుంది. జనం గురించి అంతలా ఆలోచించే పవన్ కళ్యాణ్ తనను నమ్మి కోట్లు డబ్బు పెట్టిన, కోట్ల ఆదాయం వదులుకుంటున్న వారి గురించి ఎందుకు ఆలోచించరో?