తన రేంజ్ హీరోల్లో కచ్చితంగా మంచి హీరోనే నిఖిల్. అయితే మిగిలిన వారికన్నా నిఖిల్ కు కాస్త అత్యత్సాహం ఎక్కువ. యంగ్ బాయ్. ఎక్కువగా వరల్డ్ సినిమాలు చూస్తుంటాడు. న్యూస్ ఫాలో అవుతుంటాడు. అందువల్ల సినిమాలో కాస్త ఎక్కువగా వేళ్లు పెడుతుంటాడని ఇండస్ట్రీ టాక్. గణితన్ తమిళ సినిమా కచ్చితంగా మంచి సినిమా. అక్కడ పెద్ద హిట్ సినిమా. అదే డైరక్టర్ తెలుగులో సినిమాను రీమేక్ చేసారు.
అర్జున్ సురవరం అని టైటిల్. నిజానికి అదే స్క్రిప్ట్ ను అలాగే, అదే దర్శకుడు గట్టిగా మూడునెలల్లో తీసి పక్కనపెట్టాలి. కానీ అలా మెరుగులు దిద్దుతూ వచ్చారు. దీనివెనుక తరచు హీరో నిఖిల్ ప్రతి విషయంలో ముందు వెనుకలు ఆడడం, జడ్జ్ చేయడంలో ఒకటికి పాతికసార్లు ఆలోచించడం వంటి వ్యవహారాలు వున్నాయని టాక్.
ఇప్పుడు ట్రయిలర్ బయటకు వచ్చింది. బాగుంది. అందులో సందేహంలేదు. కానీ తమిళ ట్రయిలర్ లో అస్సలు హీరోయిజం వుండదు. విలన్ దే పైచేయిగా కనిపిస్తుంది. పక్కాగా ఓ ధ్రిల్లర్ లుక్ లో కనిపిస్తుంది. కానీ తెలుగు ట్రయిలర్ ప్రారంభం కావడమే… నా పేరు అర్జున్ లెనిన్ సురవరం.
జనాలకు నిజాలు చెప్పడం నా వృత్తి అంటూ సోత్కర్షతో ప్రారంభమవుతుంది. అక్కడ నుంచి కంటిన్యూగా హీరో మీదే సాగుతుంది. హీరో మీదే ముగుస్తుంది. ఇలా కట్ చేయాలన్నది నిఖిల్ డైరక్షన్ నే అని వినిపిస్తోంది. ఎందుకంటే తమిళ దర్వకుడు అక్కడ అలా కట్ చేసి, ఇక్కడ ఇలా కట్ చేయడు కదా?
నిఖిల్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటింది. అయినా ఓ రేంజ్ కు చేరుకోవడంలో ఇంకా తడబడుతూనే వున్నాడు. మంచి సినిమాను, మంచి టీమ్ ను ఎంచుకుని నిర్మాణం వాళ్లకు వదిలేయాలి. పోస్టర్ డిజైన్ల దగ్గర నుంచి తను వేళ్లు పెట్టకూడదు.
అలా అని పాపం, నిఖిల్ కు అత్యాశలేదు, రెమ్యూనిరేషన్ దగ్గర పట్టింపులేదు. మంచి సినిమా కోసమే చూస్తాడు. అయితే ఆ చూడడం, ప్రతి విషయం తను భూతద్దంలో చూసి, పరిశీలించి, ఇలా కావాలి. అలా వుండాలి. అంటూ కిందామీదా అయిపోతాడు. టెక్నీషియన్ల బుర్రతినేసి, వాళ్ల పనిలో వేళ్లు పెట్టేస్తాడు అన్నది ఇండస్ట్రీ టాక్. ఈ ఒక్క విషయం మార్చుకుంటే నిఖిల్ కు మంచిదేమో?