ఒక్కోసారి ప్లాన్లు బూమరాంగ్ అవుతుంటాయి. నిన్నటికి నిన్న దర్శకుడు సుకుమార్, హీరో బన్నీ కలిసి వేసిన ప్లాన్ అలాగే బూమరాంగ్ అయిందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విషయం ఏమిటంటే, దర్శకుడు సుకుమార్, ఇటు హీరో మహేష్ తో, ఆ తరువాత బన్నీతో సినిమాలు చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే మధ్యలో అనిల్ రావిపూడి దూరారు. ఇది ఇటు సుకుమార్ కు ఇష్టంలేదు. అటు బన్నీకి ఇష్టంలేదు.
మహేష్ సినిమా తనదే ముందు కావాలని సుకుమార్ కు వుంది. అనిల్ రావిపూడి తన సినిమా చేయకుండా మహేష్ దగ్గరకు వెళ్లారని బన్నీకి వుంది. అందుకే చిన్న ప్లాన్ వేసినట్లు బోగట్టా. బన్నీతో సినిమా అని ప్రకటిస్తే మహేష్ పిలిచి, కారణం అడిగి, సోలో డేట్ లు ఇస్తాడేమో అని చిన్న ప్లాన్ వేసారు. అలాకనుక జరిగితే ప్రకటనతో తమకు సంబంధం లేదని చెప్పడానికి వీలుగా వుండేలా ట్వీట్ ను పీఆర్ టీమ్ చేత వేయించారు.
అటు మైత్రీ కానీ, ఇటు బన్నీ కానీ, సుకుమార్ కానీ ట్వీట్ వేయలేదు. అవసరం అయితే ఆ ట్వీట్ తో తమకు సంబంధం లేదు అని చెప్పేయచ్చు. గతంలో ఓసారి బన్నీ ఇలాగే చేసారని టాక్ వుంది. మీడియా మీట్ కు లేట్ గా వచ్చి, తనకు రాంగ్ టైమ్ చెప్పారని మీడియా టీమ్ మీద తోసేసారు. ఇప్పుడు అదే స్ట్రాటజీ.
కానీ అది బూమరాంగ్ అయింది. పీఆర్ టీమ్ ట్వీట్ సంగతి తెలిసి మహేష్ తన ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ కొట్టేసాడు. ఆల్ ది బెస్ట్ టు న్యూ ప్రాజెక్టు అన్నాడు. అంటే ఏమిటి? తన ప్రాజెక్టు వదిలి న్యూ ప్రాజెక్టు వాళ్లే తీసుకున్నారు అని మీనింగ్ వెల్లడించారన్నమాట.
పాపం, సుకుమార్ ఆశలు గల్లంతయిపోయాయి. మహేష్ తో సినిమా ఎర్రచందనం అడవుల్లో కలిసిపోయింది. బన్నీ హ్యాపీనే. ఎటొచ్చీ మైత్రీమూవీస్ నే మహేష్ కు దూరం అయిపోయింది.