జనసేన తరపున అక్కడక్కడ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. లేటెస్ట్ గా కావలి ఎమ్మెల్యే సీటుకు కంటెస్టింగ్ కేండిడేట్ ను ప్రకటించారు. పసుపులేటి సుధాకర్. ఈయన మాంచి సౌండ్ పార్టీ అని తెలుస్తోంది. కష్టపడి కింద నుంచి పైకి వచ్చి, కోట్లకు అధిపతి అయ్యారట. చిరకాలంగా రాజకీయాల్లోకి రావాలని, కోట్లకు కోట్లు వివిధ సేవా కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నారట.
ఇప్పుడు ఆయనను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. సహజంగానే తేదేపా, వైకాపా అభ్యర్థులకు గట్టి పోటీ ఇస్తారు. చాలా స్ట్రాటజిక్ గా ఇక్కడ అభ్యర్థిని జనసేన నిలబెట్టిందని టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ఈయన ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకున్నారట. తెలుగుదేశం పార్టీ కూడా ఒక దశలో ఇతని మీద కన్నేసిందట. అయితే అక్కడ ఈక్వేషన్ల రీత్యా టీడీపీకి కుదరలేదు.
ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వైకాపా పార్టీ మనిషి. అందువల్ల ఇప్పుడు ఇక్కడ వైకాపాకు బ్రేక్ వేయడానికే పవన్ అర్జెంట్ గా ఈ సుధాకర్ ను రంగంలోకి దింపారని, పేరుకు జనసేన వైపు నుంచి దిగినా తెరవెనుక తెలుగుదేశం మంత్రాంగం వుందని వినిపిస్తోంది.
తెదేపా లేదా జనసేన ఏ పార్టీ గెలిచినా ఫరవాలేదని, వైకాపా ఓడాలి అంటే జనసేన నుంచి కూడా బలమైన అభ్యర్థి వుండాలని పట్టుపట్టి సుధాకర్ ను పోటీలోకి దింపినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎక్కడెక్కడ వైకాపా బలంగా వుంటుందో అక్కడ పోటీచేయడం అన్నది జనసేన స్ట్రాటజీ అని చాలాకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఐదేళ్లలో దగాపడ్డ ఆంధ్రప్రదేశ్, పదేళ్లుగా ప్రభుత్వాల మోసాలే!