పోరు అంటే యుద్దం. యుద్దం అంటే ప్రాణ నష్టం. ప్రాణ నష్టం అంటే ఎందరి పసుపు కుంకుమలో గాల్లో కలిసిపోవడం. ఇది చాలా బాధాకరం. చిత్రంగా ఆంధ్రనాట జరుగుతున్న ఎన్నికల పోరులో కూడా పసుపు-కుంకుమలు గాల్లో కలిసిపోయాయి. అయితే ఈ పోరు వేరు. ఈ పసుపు కుంకుమలు వేరు.
నాలుగున్నరేళ్లు ఎలా పాలించినా, ప్రజా ప్రతినిధులు ఎలా ప్రవర్తించినా, ఎలా ఆదాయ సముపార్జన చేసినా, చివర్లో ఏదో సంక్షేమం పేరు చెప్పి నాలుగు కాసులు విదిలిస్తే జనం తమతోనే వుంటారని తెలుగుదేశం పార్టీ ధీమా. అందుకే ఏవేవో పేర్లు చెప్పి విచ్చలవిడిగా డబ్బులు జల్లేసారు. దాంతో ఇంక లోటు లేదు. 'విత్తు'నాలు జల్లేసాం. ఓట్ల పంట పండేస్తుంది అనుకున్నారు.
కానీ ఈలోగా రకరకాల సమ్యసలు వచ్చేసాయి. ఒక పక్క అధికారపార్టీ నుంచి వలసలు. మరోపక్క డేటా చోరీ హడావుడి. ఈ ఫోరు ఎన్నికల పోరు రీతిలో భీకరంగా సాగుతోంది. దాంతో వీటి నడుమ ఆ పైసల పంపిణీ వ్యవహారం గాల్లోకి కలిసిపోయింది.
ఇప్పుడు జనాల మధ్య డిస్కషన్ ఈ పైసల పంపిణీ పథకాలు, పసుపు కుంకాలు కాదు. పైగా ఇవి కూడా పూర్తిగా అమలుకాలేదు. రైతులకు బ్యాంకులో వేస్తామన్న పైసలు చాలామందికి పడనేలేదు. టెన్త్ పిల్లలకు సైకిళ్లు అందనే లేదు. ఫోన్ ల పంపిణీ సంగతి సరేసరి.
తెలుగుదేశం పార్టీ నుంచి జనాలు ఎందుకు వలసపోతున్నారు. ఈ డేటా చోరీ గోడవేమిటి? అదే ఇప్పుడు జనాల్లో డిస్కషన్ పాయింట్. మిగిలినవేవీ కాదు.
ఐదేళ్లలో దగాపడ్డ ఆంధ్రప్రదేశ్, పదేళ్లుగా ప్రభుత్వాల మోసాలే!