మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబో సినిమా మహర్షి. ఈ సినిమా విడుదల మీద మరింత క్లారిటీ రాబోతోంది. సినిమా ఏప్రియల్ 25న విడుదల కావడంలేదు. మే 9న విడుదలయ్యే అవకాశం వుంది. ఏ విషయమూ ఈరోజు కన్ ఫర్మ్ అవుతుంది. ఏప్రియల్ 25కు విడుదల కష్టం అని యూనిట్ భావిస్తోంది. ఏప్రియల్ 13 వరకు షూటింగ్ పనులు వున్నాయి.
అందుకే ఈ విషయంలో మహేష్ బాబును కన్విన్స్ చేసే పనిని నిర్మాత దిల్ రాజు తన మీద వేసుకున్నారు. ఏప్రియల్ 25న విడుదల చేయాలనే ఆలోచనలో హీరో మహేష్ బాబు వున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ పరిస్థితులు, సాధ్యా సాధ్యాలు అన్నీ వివరించి డేట్ ను సవరించే పనికి నిర్మాత దిల్ రాజు పూనుకున్నారు.
మే నెల మహేష్ కు సెంటిమెంట్ అని టాక్ వుంది. అదేమీలేదని, సినిమా చాలా బాగా వచ్చిందని, ష్యూర్ షాట్ హిట్ అని యూనిట్ భావిస్తోంది. అందుకే మే నెలలో విడుదలకు సిద్దపుడుతున్నారు.
ఐదేళ్లలో దగాపడ్డ ఆంధ్రప్రదేశ్, పదేళ్లుగా ప్రభుత్వాల మోసాలే!