అ.. ఆ లు అంటే అక్షరాలు కాదు. అజయ్ దేవగన్, ఆలియా భట్. వీళ్లద్దరిని రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్ ప్రాజెక్టులోకి తీసుకురావాలని ప్లాన్. అందుకే ఆ బాధ్యతలను రాజమౌళి కొడుకు అప్పగించాడట. వీళ్లని తీసుకోవాలన్నది ఫిక్స్ అయితే. ఎంత వీళ్లే కావాలని వున్నా, రేటు, బేరం, సారం అన్నవి తప్పవు కదా? అదే విధంగా డేట్ లు అడ్జస్ట్ మెంట్ కూడా.
ఎన్టీఆర్-రామ్ చరణ్ ల డేట్ లకు అనుగుణంగా వాళ్ల డేట్ లు కావాలి. బాలీవుడ్ జనాలకు ప్రీ కమిట్ మెంట్ లు చాలా వుంటాయి. అందులో ఆలియాభట్ ఫుల్ బిజీ. అందుకే ఇప్పుడు ఈ విషయాలు అన్నీ డీల్ చేసే పని రాజమౌళి తనక కొడుకు కార్తికేయకు అప్పగించాడట.
అతను ఆ పనిలో వున్నాడట. ఆలియా భట్ అంటే కోటి కాదు, కోట్లు ఇవ్వాల్సి వుంటుంది. అందుకే ఆ దిశగా జాగ్రత్తగా బేరాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. వన్స్ అన్నీ ఫైనల్ అయితే, అగ్రిమెంట్లు కుదిరితే అప్పుడు వాళ్లు చేసేదీ లేనిదీ పక్కా అవుతుంది.
ఐదేళ్లలో దగాపడ్డ ఆంధ్రప్రదేశ్, పదేళ్లుగా ప్రభుత్వాల మోసాలే!