మహేష్ కు ఫ్లాప్ ఇచ్చిన డైరక్టర్ సుకుమార్. ఇప్పుడు బన్నీతో సినిమా చేయబోతున్నారు. అలాగే మురుగదాస్. ఆయన కూడా మహేష్ కు డిజాస్టర్ ఇచ్చారు. ఆయన కూడా త్వరలో బన్నీతో సినిమా చేయబోతున్నారు. బన్నీ చేయాలని ప్లాన్ చేసుకుని ఫిక్స్ చేసుకున్న అయిదు ప్రాజెక్టుల్లో మురుగదాస్ ది కూడా ఒకటి అంట.
త్రివిక్రమ్, సుకుమార్, మురుగదాస్, విక్రమ్ కే కుమార్, ఈ నాలుగు కాక, ఓ హిందీ సినిమా బన్నీ ప్లానింగ్ లో వున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమా ప్రారంభించకుండానే సుకుమార్ సినిమాను ప్రకటించి, మహేష్ ను కార్నర్ లోకి తోసారన్న విమర్శకు విరుగుడుగా అన్నట్లు త్వరలో మురుగదాస్ సినిమాను కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఇదికాక బాలీవుడ్ సినిమా డిటైల్స్ మాత్రం బన్నీ గోప్యంగా వుంచినట్లు తెలుస్తోంది. మొత్తంమీద ఖాళీగా కూర్చున్నాడు అని తరుచూ వస్తున్న విమర్శలకు గట్టి జవాబు చెప్పడానికే బన్నీ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది.