విజయ్ బైక్ రేసింగ్ ప్రాక్టీస్

త్వరలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా కనిపించబోతున్నాడు. మైత్రీమూవీస్ లో తమిళ దర్వకుడు ఆనంద్ తో చేయబోయే సినిమాలో బైక్ రేసర్ గా విజయ్ కనిపిస్తాడు. ఇందుకోసం అప్పుడే ప్రాక్టీస్ కూడా మొదలు…

త్వరలో విజయ్ దేవరకొండ బైక్ రేసర్ గా కనిపించబోతున్నాడు. మైత్రీమూవీస్ లో తమిళ దర్వకుడు ఆనంద్ తో చేయబోయే సినిమాలో బైక్ రేసర్ గా విజయ్ కనిపిస్తాడు. ఇందుకోసం అప్పుడే ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేసాడు. ఒకపక్క డియర్ కామ్రేడ్ చేస్తూనే, మరోపక్క తమిళనాడులో వున్న ఓ రేసింగ్ ట్రాక్ మీద ట్రయినింగ్ తీసుకుంటున్నాడు.

ఇందుకోసం తరచు అక్కడికి వెళ్లి వస్తున్నాడు. బైక్ రేసింగ్ ఫ్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించడమే ఢిల్లీలోని రేస్ ట్రాక్ మీద ప్రారంభిస్తారు. బైక్ రేసింగ్ అంటే ఆషామాషీ కాదు. అందుకే విజయ్ చాలా సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నట్లు బోగట్టా.

ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ తన తరువాత సినిమాగా మైత్రీమూవీస్ లో ఈ ప్రాజెక్టును ఫిక్స్ అయ్యాడు. డియర్ కామ్రేడ్, క్రాంతిమాధవ్ సినిమాల తరువాత ఈ సినిమా అన్నమాట.

బాబు ఐదేళ్ల పాలనలో సాధించేది గ్రాఫిక్సే!