విష్వక్ కోసం ప్రసన్న కథ

రచయిత ప్రసన్న యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ కథలు బాగా రెడీ చేస్తాడని పేరు వుంది. ఇన్నాళ్లూ దర్శకుడు నక్కిన త్రినాధరావుతోనే అసోసియేట్ అవుతూ వస్తున్నాడు.  Advertisement నక్కన ను అలా కూర్చోపెట్టి…

రచయిత ప్రసన్న యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ కథలు బాగా రెడీ చేస్తాడని పేరు వుంది. ఇన్నాళ్లూ దర్శకుడు నక్కిన త్రినాధరావుతోనే అసోసియేట్ అవుతూ వస్తున్నాడు. 

నక్కన ను అలా కూర్చోపెట్టి ప్రసన్ననే మొత్తం బండి లాగేస్తాడనే టాక్ కూడా ఇండస్ట్రీలో వుంది. ఈ ఇద్దరూ కలిసే ఇప్పటికీ రవితేజ సినిమా కథ కోసం కుస్తీ పడుతున్నారు. 

కానీ లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, హీరో విష్వక్ సేన్ కోసం ప్రసన్న ఓ కథను రెడీ చేసాడన్నది. కథ విని విష్వక్ కూడా ఓకె అనేసాడు ఇన్ స్టాంట్ గా. కానీ ఈ కథకు నక్కిన త్రినాధ్ ను కాకుండా వేరే డైరక్టర్ గురించి వెదుకుతున్నారు. 

18 పేజెస్ సూర్య ప్రతాప్ పేరు ఈ వెదుకులాట లిస్ట్ లో వుంది. సూర్య ప్రతాప్ పేరును ప్రసన్ననే స్వయంగా సూచించినట్లు తెలుస్తోంది.