లక్ష్మీస్ ఎన్టీఆర్. ఇప్పుడు టాక్ ఆఫ్ తెలుగు పొలిటీషియన్స్. అంతేకాదు. టాలీవుడ్ లో కూడా. ఆర్జీవీ ఆ సినిమాను ఎలా తీయబోతున్నారు. కుటుంబ కుట్రలు అంటున్నారు. నందమూరి ఫ్యామిలీని ఏ మేరకు టార్గెట్ చేయబోతున్నారు. ఇలాంటి డిస్కషన్లు అన్నీ సాగుతున్నాయి.
ఇదంతా ఇలా వుంచితే అసలు తన కథను, తన పెర్ సెప్షన్ లో తీయడానికి లక్ష్మీపార్వతి అనుమతి ఎలా ఇచ్చారు? ఎంత పాజిటివ్ యాంగిల్ అయినా, ఆమెకు రాయల్టీ ఇవ్వాలి కదా? హిందీలో బయోపిక్ లు తీసినపుడు ఇలా ఇవ్వడం అన్న పద్దతి ఒకటి వుంది. ఆ మధ్య సంజయ్ దత్ కు ఇలా ఇచ్చారని వార్తలు వున్నాయి.
లక్ష్మీస్ ఎన్టీఆర్ కు కూడా అలా ఇచ్చారని గుసుగుసలు వినిపిస్తున్నాయి. కోటిన్నర మొత్తాన్ని లక్ష్మీపార్వతికి రాయల్టీగా ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. పైగా ఈ మొత్తాన్ని లక్ష్మీపార్వతి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈవార్తలు ఎంతవరకు నిజమో అన్నది తెలియాల్సి వుంది. అయితే ఇండస్ట్రీలో ఈ టాక్ వినిపిస్తోంది.