హారికకు త్రివిక్రమ్ మాదిరిగా, మైత్రీకి సుకుమార్ ఇప్పుడు. ఎప్పుడు చేసినా సరే, సుకుమార్ ను చూపించి సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇదే మైత్రీ పీకల మీదకు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే సుకుమార్-మైత్రీ సినిమాకు నిన్నటి నిన్నే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్ బాబు.
మహేష్ సినిమా లేట్ అవుతుందేమో అని బన్నీ దగ్గరకు వెళ్లారు. వాస్తవానికి బన్నీతో సినిమా అని మైత్రీ జనాలు సరైనోడు సినిమా టైమ్ నుంచి కిందా మీదా అవుతున్నారు. ఇప్పుడు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. కానీ నిన్నటికి నిన్నే మహేష్ తన అనుమతి ఇచ్చాడు.
సుకుమార్ తో సినిమా స్క్రిప్ట్ కు. అనిల్ రావిపూడి సినిమాతో పాటు సుకుమార్ సినిమాకు కూడా డేట్ లు సమాంతరంగా ఇస్తా అన్నాడు మహేష్. ఈ విషయంలో మైత్రీ-సుకుమార్ ఇంకా ఏ విషయం ఫిక్స్ కాలేదు. ఇలాంటి నేపధ్యంలో బన్నీ వైపు నుంచి సుకుమార్ సినిమా ప్రకటన వచ్చేస్తోంది. అది కూడా బన్నీ వైపు నుంచి.
మైత్రీ వాళ్లు సైలంట్ గా వుండాల్సిన టైమ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఊకొట్టిన మహేష్ మనసు మారకుండా వుండాలి. ఇలాంటి టైమ్ లో బన్నీ వైపు నుంచి సుకుమార్ సినిమా అనే ప్రకటన ఇస్తే మైత్రీ మూవీస్ కు మైనస్ అయ్యే అవకాశం వుంది.
లేదా మహేష్ ను ముందుకు లాగడం కోసం సుకుమార్ ఈ ప్రకటన చేయిస్తున్నారా?