ఎప్పుడూ లేనిది సమాంతరంగా డేట్ లు ఇస్తానని వాలంటరీగా ముందుకు వచ్చాడు మహేష్ బాబు. మైత్రీమూవీస్-సుకుమార్ సినిమా కోసం మహేష్ అలా ముందుకు వస్తే, వాళ్లు మాత్రం ఆగస్టు నుంచి బన్నీతో సినిమా చేయాలని డిసైడ్ అయిపోయారు. అనిల్ రావిపూడితో సినిమా చేస్తూనే, సుకుమార్ సినిమా కూడా చేస్తా అన్నాడు. ఎప్పుడో చెప్పిన ఎర్రచందనం కథకే లవ్ స్టోరీ జోడించి తీసుకువస్తే, సరే, ఓకే అన్నాడు.
మహేష్ బాబు ఇన్ని అన్నాక, మైత్రీ జనాల కన్సెంట్ లేకుండానే బన్నీ యూనిట్ నేరుగా సుకుమార్ తో సినిమా అని పనిగట్టుకుని ఈ రోజే ప్రకటించింది. ఈరోజు ఉదయం సుకుమార్ – మహేష్ వార్తలు రావడం వల్లనే ఈ ప్రకటన బయటకు వదిలారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫైగా ఆగస్టు నుంచి బన్నీ-సుకుమార్ సినిమా సెట్ మీదకు వెళ్తుందని టాక్.
అంటే ఇక మహేష్-సుకుమార్ సినిమా మీద మైత్రీ జనాలు ఆశలు వదులుకోవాల్సిందేనేమో?