రేణు క‌ల‌లు కంటున్న మ‌రో ప్ర‌పంచం అదే…

“క‌ల‌లు క‌నండి…వాటిని సాకారం చేసుకోండి” అని మాజీ రాష్ట్ర‌ప‌తి దివంగ‌త అబ్ద‌ల్‌క‌లాం అందించిన సందేశం యావ‌త్ ప్ర‌పంచానికి స్ఫూర్తినిచ్చింది. ఈ ఒక్క మాటే యువ‌త‌పై తార‌క మంత్రంగా ప‌ని చేస్తోంది. జీవితంలో పైకి రావాలంటే…

“క‌ల‌లు క‌నండి…వాటిని సాకారం చేసుకోండి” అని మాజీ రాష్ట్ర‌ప‌తి దివంగ‌త అబ్ద‌ల్‌క‌లాం అందించిన సందేశం యావ‌త్ ప్ర‌పంచానికి స్ఫూర్తినిచ్చింది. ఈ ఒక్క మాటే యువ‌త‌పై తార‌క మంత్రంగా ప‌ని చేస్తోంది. జీవితంలో పైకి రావాలంటే ముందు క‌ల‌లు క‌నాలి. ఆ త‌ర్వాత వాటిని సాధించేందుకు నిద్ర‌లేని రాత్రులు గ‌డ‌పాలి.

ప్ర‌ముఖ న‌టి రేణుదేశాయ్ సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌గా ఉంటారు. ఆమె ఆలోచ‌న‌, ఆచ‌ర‌ణ విభిన్నంగా, వినూత్నంగా ఉంటాయి. తాజాగా ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. వికారాబాద్‌లోని ఓ గ్రామంలో చిన్న‌పిల్ల‌ల‌తో స‌ర‌దాగా గ‌డిపిన ఆ వీడియోలో రేణు చాలా చ‌లాకీగా క‌నిపించారు. చిన్న పిల్ల‌ల‌తో బాబా ఫోజ్ పెట్టిస్తూ రేణు ఉత్సాహంగా గ‌డిపారు.

 అంతేకాదు, ఆవులు, మేకలు, కాకులు, కొంగల వీడియోలను తన ఇన్‌స్ట్రా గ్రామ్‌ అకౌంట్‌లో ఆమె పోస్ట్ చేశారు. ఎంతో ఆహ్లాదాన్ని పంచే  పల్లె జీవితాన్ని తాను కోల్పోతున్నాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.  ఈ సంద‌ర్భంగా రేణు త‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను కూడా ప్ర‌క‌టించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు.

తన పిల్లలు కాలేజీలో చేరిన తర్వాత మిగిలిన శేష జీవితాన్ని కూరగాయలు పండిస్తూ మారుమూల గ్రామంలో గడపాలని గ‌ట్టిగా  కోరుకుంటున్న‌ట్టు రేణు వెల్ల‌డించారు. గ్రామంలో ఓ పది పిల్లులు, 10 కుక్క‌లు, ఇత‌ర‌త్రా మూగజీవాలు, లెక్కలేనన్ని పుస్తకాలు, ఇవి ఉంటే చాలు త‌న‌కు స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంద‌ని ఆమె  పోస్ట్‌ పెట్టారు. త‌న క‌ల నెర‌వేరే రోజు  త్వరలో  వస్తుందని ఆమె ఆకాంక్షించారు.

అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో బయట తిరగొద్దు అంటూ ఓ అభిమాని చేసిన కామెంట్‌కి రేణు సూటిగా, ఘాటుగా బ‌దులిచ్చారు. ఈ వీడియోలు  ఇంతకు ముందు తీసినవ‌ని, ఆ విష‌యాన్ని క్యాప్షన్‌లో చూసి తెలుసుకుని కామెంట్లు పెట్టాలని రేణుదేశాయ్ గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు. మొత్తానికి రేణుదేశాయ్ క‌ల‌లు కంటున్న మ‌రో ప్ర‌పంచాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపారు.

ఇంట్లో నేతి దీపాలు వెలిగించాలా?