ఆ హీరోతో అయితే లిప్ కిస్ కు ఓకే: తమన్నా

తను తెరమీద కిస్సులు పెట్టనని స్పష్టంచేసింది తమన్నా భాటియా. ముద్దుసీన్లలో నటించడానికి తను ఏమాత్రం ఆసక్తి చూపనని ఈ నటీమణి అంటోంది. తను ఒప్పుకునే సినిమాల విషయంలో ఈ షరతులు విధిస్తున్నట్టుగా తమన్నా పేర్కొంది.…

తను తెరమీద కిస్సులు పెట్టనని స్పష్టంచేసింది తమన్నా భాటియా. ముద్దుసీన్లలో నటించడానికి తను ఏమాత్రం ఆసక్తి చూపనని ఈ నటీమణి అంటోంది. తను ఒప్పుకునే సినిమాల విషయంలో ఈ షరతులు విధిస్తున్నట్టుగా తమన్నా పేర్కొంది.

ఈ రోజుల్లో చాలామంది స్టార్ హీరోయిన్లు కూడా తెరమీద లిప్ కిస్సులతో రెచ్చిపోతూ ఉన్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఇదే సంప్రదాయమే సాగుతూ ఉంది. అయితే  తెరమీద కిస్సుల ప్రసక్తే లేదని తమన్నా స్పష్టం చేస్తోంది. ఇప్పటి వరకూ చేసిన సినిమాల విషయంలో తను ఆ షరతును విధించినట్టుగా ఒక టాక్ షోలో తమన్నా చెప్పింది.

అయితే ఈ విషయంలో ఒక హీరోకి మాత్రం తను మినహాయింపును ఇస్తానని తమన్నా పేర్కొనడం విశేషం. అతడితో అయితే తెరమీద కూడా లిప్ కిస్సులకు సై అంటోంది తమన్నా. తమన్నా అలా మినహాయింపును ఇస్తోంది మరెవరికో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు. 

అతడితో నటించే అవకాశం ఇస్తే.. అతడితో తెరమీద ముద్దులు పెట్టుకోవడానికి తను ఏమాత్రం అభ్యంతరం చెప్పనని తమన్నా చెబుతోంది. అతను ఆ హీరోకి పెద్ద ఫ్యాన్ అని.. అందుకే ఆ మినహాయింపు అని చెబుతోంది.

కొంతకాలం కిందట హృతిక్ ను చూసినప్పుడు తమన్నాకు మాటలే రాలేదట. అతడిని చూడగానే అలా అనిపించిందట. చివరకు అతడి దగ్గరకు వెళ్లి తను ఆయనకు పెద్ద ఫ్యాన్ అని చెప్పిందట. ఆయన ఫొటోకు ఓకే చెప్పడంతో తమన్నా ఉబ్బితబ్బిబ్బు అయ్యిందట!

బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ను ఇరికించారా? ఇరుక్కున్నారా?

రాయలసీమ వరకూ జనసేన చర్చలోనే లేదు…