తెలుగు తమ్ముళ్లందు మంచి తమ్ముళ్ళు వేరయా అని ఆయన నిరూపించారు. పచ్చ రాజకీయాలు, పక్షిపాత రాజకీయాల నుంచి బాగా దూరం జరిగారు, అచ్చమైన ప్రజా ప్రతినిధిలాగ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఆయన తాను విపక్షం అని, ప్రభుత్వాన్ని ఇదే సమయంగా ఏకేయాలనుకొవడంలేదు.
అందుకే ఆయన ముఖ్యమంత్రి జగన్ కి లేఖ రాస్తూ విశాఖలో విస్తరిస్తున్న కరోనా కేసుల గురించి ఆయన ద్రుష్టికి తీసుకు వచ్చారు. విశాఖలో కరోనా కేసులు ఎక్కువ అవుతున్న నేపధ్యంలో ప్రభుత్వం విశాఖలో కరోనా టెస్ట్ ల్యాబ్స్ ని ఏర్పాటు చేయాలని కోరారు.
అదే విధంగా హై రిస్క్ ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించిన సీతమ్మధార, గాజువాక, అనకాపల్లిలలో ఐసోలేషన్ వార్డులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని కూడా కోరారు. అదే విధంగా విశాఖలో రైతు బజార్లను మరిన్ని పెంచాలని, జీవీఎంసీ పన్నుల వసూలుని మూడేళ్ళ పాటు వాయిదా వేయాలని కూడా సూచించారు.
మొత్తానికి ఆపత్కాలంలో ప్రభుత్వానికి సూచనలు సలహాలు చేయడంలో గంటా విపక్ష ఎమ్మెల్యేగా ఉంటూ కూడా విచక్షణ చూపించారనే చెప్పుకోవాలి. అంతే తప్ప ఇదే సందు అన్నట్లుగా సర్కార్ మీద బురద జల్లకుండా గంటా చూపించిన వివేచనను అంతా హర్షిస్తున్నారు.