కరోనా ఎఫెక్ట్.. మద్యం దొరక్క ఆత్మహత్యలు

కరోనా సోకి కొందరు చనిపోతుంటే.. కరోనా వచ్చిందేమో అనే అనుమానంతో మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ రెండు రకాలు కాకుండా ఇందులో మరో కోణం కూడా ఉంది. కరోనా వల్ల దేశమంతా లాక్ డౌన్…

కరోనా సోకి కొందరు చనిపోతుంటే.. కరోనా వచ్చిందేమో అనే అనుమానంతో మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ రెండు రకాలు కాకుండా ఇందులో మరో కోణం కూడా ఉంది. కరోనా వల్ల దేశమంతా లాక్ డౌన్ పాటిస్తున్న వేళ.. మద్యం దొరక్క ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో జరిగింది.

ఫిలిం ఇండస్ట్రీకి చెందిన మధు అనే పెయింటర్ కు రోజూ మద్యం సేవించడం అలవాటు. చుక్క పడందే ఇతడి దగ్గర పని జరగదు. అలాంటిది లాక్ డౌన్ కారణంగా 6 రోజులుగా మందు దొరక్క అల్లాడిపోయాడు. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా కుంగిపోయాడు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బంజారాహిల్స్ లోని ఓ 4 అంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడ్ని వెంటనే ఉస్మానియా హాస్పిటల్ కు తీసుకెళ్లినప్పటికీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు.

సరిగ్గా బంజారాహిల్స్ కు కొద్దిమీటర్ల దూరంలో ఉన్న బేగంపేట్ లో కూడా ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. మద్యం దొరక్క సాయికుమార్ అనే 32 ఏళ్ల వ్యక్తి ఏకంగా ఫ్లై ఓవర్ నుంచి కిందకు దూకేశాడు. ప్రస్తుతం ఇతడి పరిస్థితి విషమంగా ఉంది.

మొన్నటివరకు మద్యం బ్లాక్ లో దొరికేది. రేటు ఎక్కువైనా కొనుక్కొని తాగేవారు. కానీ ఇప్పుడు అక్కడ కూడా స్టాక్ అయిపోవడంతో మందుబాబులకు దిక్కుతోచడం లేదు. చాలామంది మతి స్థిమితం కోల్పోతున్నారు. తెలంగాణలోని దాదాపు ప్రతి జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

మరోవైపు మద్యం దుకాణాల్లో చోరీలు కూడా ఎక్కువయ్యాయి. భువనగిరి, చౌటుప్పల్ ప్రాంతాల్లో వైన్ షాపులపై దొంగలు పడ్డారు. చేతికి అందినకాడికి మద్యం సీసాలు ఎత్తుకెళ్లారు. కౌంటర్ లో ఉన్న డబ్బులు మాత్రం అలానే ఉన్నాయి. దీంతో ఇది మందుబాబుల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇంట్లో నేతి దీపాలు వెలిగించాలా?

మేము సైతం