‘సీత’ను మరిచిపోయారు

బెల్లంకొండ శ్రీనివాస్.. కాజల్ కాంబినేషన్ లో దర్శకుడు తేజ అందిస్తున్న సినిమా సీత. ఈ సినిమా ప్రారంభమై చాలారోజులు అయింది. ఈ సినిమా దాదాపు పూర్తయిపోయిందని బోగట్టా. కానీ విడుదల ఎప్పుడు అన్నదే తెలియదు.…

బెల్లంకొండ శ్రీనివాస్.. కాజల్ కాంబినేషన్ లో దర్శకుడు తేజ అందిస్తున్న సినిమా సీత. ఈ సినిమా ప్రారంభమై చాలారోజులు అయింది. ఈ సినిమా దాదాపు పూర్తయిపోయిందని బోగట్టా. కానీ విడుదల ఎప్పుడు అన్నదే తెలియదు. ఈలోగా ఈ సినిమాను పక్కనపెట్టి, నిర్మాణ సంస్థ అయిన ఎకె ఎంటర్ టైన్మెంట్స్ గోపీచంద్ తో నిర్మించే సినిమా మీద బిజీ అయిపోయింది.

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తన తరువాత సినిమా మీదకు వెళ్లిపోయారు. హీరోయిన్ కాజల్ కూడా డిటో.. డిటో.. మరి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోందా? విడుదల ఎప్పుడు అన్నది తెలియడం లేదు. ఈలోగా అదే హీరో నటించే రాక్షసన్ రీమేక్ మాత్రం చకచకా జరిగిపోతోంది.

ఏప్రియల్ ధర్డ్ వీక్ కు సినిమాను రెడీ చేసేయాలని చకచకా షూట్ చేస్తున్నారు. వీలయితే ఏప్రియల్ లో, లేదా మే నెలలో విడుదల చేయాలన్నది ఈ సినిమా యూనిట్ ప్లాన్ గా వుంది. మరి ఈ సినిమా ఏప్రియల్ మే అంటే, సీత సినిమా ఎప్పుడు? ముందు సినిమా ముందుగా కాకుండా, వెనక్కు వెళ్లంది ఎందుకుని? ఈ అనుమానాలన్నీ ఇండస్ట్రీలో వ్యక్తం అవుతున్నాయి.

కళ్యాణ్ రామ్ తన సినిమాపై అంచనాలేంటి..

చంద్రబాబు ఒట్టే గట్టు మీద పెట్టారు.. జనం ఒట్లను పట్టించుకోవాలా!