రజనీకాంత్ కు ధైర్యం వచ్చింది

ఓ గ్రూప్ కు నాయకుడిగా కాలా సినిమా చేశాడు. గ్రాఫిక్ వండర్ గా 2.O సినిమాలో నటించాడు. ఇక పేట సినిమాలో తనను నమ్ముకున్న వాళ్లను కాపాడుకునే వ్యక్తిగా కనిపించాడు. సో.. ఎలా చూసుకున్నా…

ఓ గ్రూప్ కు నాయకుడిగా కాలా సినిమా చేశాడు. గ్రాఫిక్ వండర్ గా 2.O సినిమాలో నటించాడు. ఇక పేట సినిమాలో తనను నమ్ముకున్న వాళ్లను కాపాడుకునే వ్యక్తిగా కనిపించాడు. సో.. ఎలా చూసుకున్నా రజనీకాంత్ నుంచి ఫుల్ లెంగ్త్ పొలిటికల్ మూవీ రాలేదు. ఇప్పుడా టైమ్ రానే వచ్చింది. మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ చేయబోయే సినిమాలో ఫుల్ గా పొలిటికల్ పంచ్ లు ఉండబోతున్నాయి.

రజనీకాంత్ సినిమాలో పాలిటిక్స్ టచ్ చేయడం కొత్తకాదు. గతంలో ఈ హీరో నటించిన ఎన్నో సినిమాల్లో రాజకీయ ఎంట్రీపై డైలాగులు పేలాయి. కానీ ఈసారి మాత్రం రజనీకాంత్ పూర్తిస్థాయి పొలిటికల్ మూవీలో నటిస్తున్నాడు. ఎన్నికల వేళ రజనీకాంత్ ఇలా పొలిటికల్ మూవీ చేయడం తమిళనాట ఆసక్తి రేకెత్తిస్తోంది.

మురుగదాస్ దర్శకత్వంలో మార్చి నుంచి సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాలో రాష్ట్రానికి మంచి చేసే ఓ పవర్ ఫుల్ పొలిటీషియన్ పాత్రలో రజనీకాంత్ కనిపిస్తాడట. ఎప్పట్లానే ఈ సినిమాలో కూడా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఈ మేరకు ఇద్దరు హీరోయిన్లను తీసుకున్నారు. వాళ్లే నయనతార, కీర్తిసురేష్. వీళ్లలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చేది ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

జయలలిత ఉన్న టైమ్ లో పొలిటికల్ మూవీ చేసే సాహసం చేయలేదు రజనీకాంత్. జయలలిత వల్ల విజయ్, కమల్ హాసన్ లాంటి హీరోలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రత్యక్షంగా చూశాడు కాబట్టి, అసలే ముందుజాగ్రత్త ఎక్కువగా ఉన్న వ్యక్తి కాబట్టి రజనీకాంత్ అలాంటి ప్రయోగాలకు పోలేదు.

ఎట్టకేలకు రజనీకాంత్ కు కూడా ధైర్యం వచ్చింది. ఓ ఫుల్ లెంగ్త్ పొలిటికల్ మూవీకి లైన్ క్లియర్ అయింది. ఈ సినిమా తళైవ రాజకీయ జీవితానికి ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.

కళ్యాణ్ రామ్ తన సినిమాపై అంచనాలేంటి..

చంద్రబాబు ఒట్టే గట్టు మీద పెట్టారు.. జనం ఒట్లను పట్టించుకోవాలా!