తెలుగుదేశం పార్టీలో మార్చి 22 టెన్షన్ మొదలైంది. ఇప్పటికే మహానాయకుడు డిజాస్టర్ గా మారిన వైనం ఓవైపు, లక్ష్మీస్ ఎన్టీఆర్ తో వర్మ పెడుతున్న టెన్షన్ మరోవైపు. వర్మ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుంటే పచ్చ టీమ్ లో దడ మొదలైంది. సినిమాని అడ్డుకోడానికి నానాపాట్లూ పడుతున్నారు టీడీపీ నేతలు. కోర్టు మెట్లెక్కినా ఫలితం లేకపోవడంతో అధికార బలంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ఆపాలని చూస్తున్నారు.
మొన్నటికి మొన్న సంక్రాంతి బరిలో నిలిచిన కథానాయకుడి కోసం ఇతర సినిమాలకు థియేటర్లు దొరక్కుండా చేసిన చరిత్ర టీడీపీది. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల టైమ్ లో గొడవలు చేయడం వారికి కొత్తేమీ కాదు. అందులోనూ సాక్షాత్తూ అధినేత చంద్రబాబే సినిమాని అడ్డుకోవాలని చూస్తున్నారు. అయ్యగారి ఆజ్ఞ అయిపోయింది కాబట్టి, వర్మపై విరుచుకుపడ్డానికి రెడీగా ఉంది ''తెలుగు''దండు. దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా రెడీ అయిందని సమాచారం.
సెన్సార్ ఇబ్బందులు సృష్టించి సినిమా విడుదల వాయిదాపడేలా చూడటం లేదా, అభ్యంతరకర దృశ్యాలు తొలగించే పథకంలో భాగంగా సినిమాను అస్తవ్యస్తం చేయడం. ఇదీ కుదరకపోతే విడుదలరోజు థియేటర్ల ముందు నిరసనలు చేయడం.. క్లుప్తంగా టీడీపీ కుటిల పన్నాగాలివి. ఇలా ఏ దశలోనైనా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని అడ్డుకోవాలని అనుకుంటున్నారు. ఒకరకంగా మహానాయకుడిపై కంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ పైనే తెలుగుదేశం పార్టీ ఫోకస్ ఎక్కువ పెట్టింది.
మరోవైపు జనాల్లో మాత్రం ఆ సినిమా ఎలా ఉందో చూడాలనే కుతూహలం రోజురోజుకీ పెరిగిపోతోంది. విడుదలైన ట్రైలర్లు, పాటలు, సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. బాలయ్య సినిమాలు రెండూ దారుణంగా ఉండటం, వర్మ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్, ఈ రెండు సినిమాల్ని చూసిన వాళ్లు కచ్చితంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని కూడా చూస్తారు. పార్టీల పరంగా చూసినా కూడా టీడీపీ వ్యతిరేకులంతా లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబుపై ఎలాంటి సెటైర్లు పడ్డాయోనని ఆసక్తిగా చూస్తుంటారు. వారందరికీ ఈ సినిమా విందు భోజనంలా ఉండబోతోంది.
సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, ఎన్నిరోజులు ఆడినా, ఎంతమంది థియేటర్లకు వెళ్లినా చంద్రబాబు పరువుపోవడం మాత్రం ఖాయం. బామ్మర్దులతో కలిసి మామని బాబు ఎలా వెన్నుపోటు పొడిచిందీ, తేనెపూసిన కత్తిలాగా మామ చుట్టూ తిరుగుతూనే ఆయన సామ్రాజ్యాన్ని ఎలా హస్తగతం చేసుకుందీ ఇందులో కళ్లకు కట్టినట్టు చూపంచబోతున్నాడు రామ్ గోపాల్ వర్మ. మొత్తమ్మీద లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం సగటు ప్రేక్షకుడిలాగే చంద్రబాబు కూడా ఆందోళనతో ఎదురు చూస్తున్నారు. ఇక్కడే లక్ష్మీస్ ఎన్టీఆర్ సగం సక్సెస్ సాధించింది.
కళ్యాణ్ రామ్ తన సినిమాపై అంచనాలేంటి..
చంద్రబాబు ఒట్టే గట్టు మీద పెట్టారు.. జనం ఒట్లను పట్టించుకోవాలా!