మే నెల విడుదల అచ్చిరాదని మహేష్ కు, ఆయన ఫ్యాన్స్ కు ఓ సెంటిమెంట్. మే నెలలో విడుదలైతే పరాజయం పలకరిస్తుందని భయం. అందుకే ఎలాగైనా మహేష్ తన మహర్షి సినిమాను ఏప్రియల్ లోనే విడుదల చేయాలనుకుంటున్నారు. ఆ మేరకు యూనిట్ పై వత్తిడి తెస్తున్నారు. వాళ్లని పరుగులు పెట్టిస్తున్నారు. దాంతో అధికారికంగానే ఏప్రియల్ 25 విడుదల అని ప్రకటించేసారు.
ఇప్పుడు మహర్షి యూనిట్ ఉరకలు పరుగులు పెట్టాలి. ఇప్పటికి వున్న షెడ్యూలు ప్రకారం ఏప్రియల్ 10 వరకు షూటింగ్ పని వుంది. అది పాటలైతేనేం, టాకీ అయితేనేం. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సమాంతరంగా చేస్తున్నారు. చేయాలి కూడా. లేదంటే డెడ్ లైన్ ను మీట్ కావడం కష్టం అవుతుంది.
అదృష్టం ఏమిటంటే, మహర్షి విడుదలకు ముందు బోలెడు సినిమాలు లైన్ లో వున్నాయి కానీ, మహర్షి విడుదల తరువాత దాదాపు నెలరోజుల పాటు చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీలేవు. సమ్మర్ హాలీడేస్ అంతా మహర్షివే.
మరోపక్క డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు మీద విపరీతమైన ప్రెజర్ వుంది. ఏప్రియల్ ఫస్ట్ వీక్ లో విడుదల కావాల్సిన జెర్సీ, మజిలీ, చిత్రలహరి మేలో విడుదలయ్యే శర్వానంద్-సుధీర్ వర్మ సినిమా, అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా ఇలా చాలా వున్నాయి.
మరోపక్క ఆయన నిర్మాతగా మార్చిలో రాజ్ తరుణ్ సినిమా, ఆ వెంటనే శర్వానంద్-సమంత సినిమా ప్రారంభిస్తున్నారు. వీటిని త్వరత్వరగా పూర్తిచేయాల్సి వుంది. ఇన్ని సినిమాల విడుదల, నిర్మాణం, పంపిణీ ఇవన్నీ ఒకేసారి చేయాల్సిరావడం కాస్త కష్టమే.
కళ్యాణ్ రామ్ తన సినిమాపై అంచనాలేంటి..
చంద్రబాబు ఒట్టే గట్టు మీద పెట్టారు.. జనం ఒట్లను పట్టించుకోవాలా!