ఆకలి మీద వున్నవాడికి అన్నం దొరికితే పులిలా పడిపోవాల్సిందే. చాలాకాలం తరువాత దర్శకుడు రమేష్ వర్మ చేతికి ఓ పెద్ద సినిమా వచ్చింది. హీరో బెల్లంకొండతో చేసే రాక్షసన్ రీమేక్ కు ఆయనే దర్శకుడు. హీరో హవీష్, ఆయన తండ్రి నిర్మాతలు. ఇలాంటి నేపథ్యంలో ఖర్చు ఆరంభం నుంచే భారీగా వుంటోందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాకు హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నారు. వాస్తవానికి సినిమాలో ఆమె పాత్ర పెద్దదికాదు. కొన్నిసీన్లు, రెండు డ్యూయట్లు మాత్రమే. అలాంటిది ఆమెకు ఈ సినిమాకు 80 లక్షలకు పైగా రెమ్యూనిరేషన్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఆమె రెమ్యూనిరేషన్ 50 నుంచి 60 మధ్యలో వుంటుందని ఇండస్ట్రీ టాక్. మరి ఈ సినిమాకు ఇంత ఎందుకు ఆఫర్ చేసారో తెలియదు. పెద్ద పాత్ర కాదు, అలా అని అనుపమ తెలుగులో మరీ విపరీతమైన డిమాండ్ లో కూడా లేదు. దర్శకుడు రమేష్ వర్మనే ఈ డీల్ సెట్ చేసారని, ఆయన అనుపమనే కావాలని ఫిక్స్ అయిపోయి వుండడంతో, ఇంత అమౌంట్ ఆఫర్ చేసి వుండొచ్చని వినిపిస్తోంది.
జిబ్రాన్ కు కూడా ?
ఇదిలావుంటే రాక్షసన్ రీమేక్ కు సంగీత దర్శకుడిగా జిబ్రాన్ ను తీసుకున్నట్లు బోగట్టా. జిబ్రాన్ రెమ్యూనిరేషన్ కింద కాస్త ఎక్కువ మొత్తమే ఇచ్చారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇది నిజమేనా? అని ఇండస్ట్రీ జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇదిలావుంటే రాక్షసన్ రీమేక్ హక్కులకు రెండున్నర కోట్ల వరకు ఖర్చుచేసారు. అది కూడా కాస్త ఎక్కువే అనుకోవాలి.
కళ్యాణ్ రామ్ తన సినిమాపై అంచనాలేంటి..
చంద్రబాబు ఒట్టే గట్టు మీద పెట్టారు.. జనం ఒట్లను పట్టించుకోవాలా!