బీదర్ లో ‘సైరా’ కు చుక్కెదురు?

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గాథ ఆధారంగా తీస్తున్న సైరా షూట్ కు బ్రేక్ పడింది. బీదర్ కు వారంరోజుల షెడ్యూలుకు అన్ని పర్మిషన్లు తీసుకుని వెళ్లిన యూనిట్ తిరుగుముఖం పట్టింది. బీదర్ లో షూట్ చేయడానికి…

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గాథ ఆధారంగా తీస్తున్న సైరా షూట్ కు బ్రేక్ పడింది. బీదర్ కు వారంరోజుల షెడ్యూలుకు అన్ని పర్మిషన్లు తీసుకుని వెళ్లిన యూనిట్ తిరుగుముఖం పట్టింది. బీదర్ లో షూట్ చేయడానికి ఇక కుదరదని డిసైడ్ అయిపోయి, హైదరాబాద్ కోకాపేట్ లో వేసిన భారీకోట సెట్ లో షూట్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు.

విషయం ఏమిటంటే, మెగాస్టార్-సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తయారవుతున్న సైరా సినిమా యూనిట్ బీదర్ కు షూటింగ్ కు వెళ్లింది. కత్తులు, తలపాగాలు, గెడ్డాలు, గెటప్ లు ఇవన్నీ చూసిన తరువాత లోకల్స్ కొందరు అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది. 

బీదర్ కాస్త సెన్సిటివ్ ఏరియా అని, ఇక్కడ ఇలాంటి గెటప్ లు, జెండాలు, వ్యవహారాలతో షూటింగ్ లు చేసి, సమస్యలు క్రియేట్ చేయవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. అన్నిరకాలు పర్మిషన్లు వున్నాయని చెప్పినా, లోకల్స్ వినలేదని తెలుస్తోంది. దాంతో హైదరాబాద్ లో మ్యాచ్ వర్క్ చేసుకుంటామని టీమ్ వెనక్కు వచ్చేసింది.

రామ్ చరణ్ నిర్మాతగా 200 కోట్ల బడ్జెట్ తో తయారవుతున్న సైరా సినిమా ఈ ఏడాది చివర్లో కానీ వచ్చే ఏడాది సంక్రాంతికి కానీ విడుదల లక్ష్యంగా రెడీ అవుతోంది.

రాయలసీమ వరకూ జనసేన చర్చలోనే లేదు…