శర్వా.. నాని.. ఆగస్టు 29

నాని,-విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తయారవుతున్న టైటిల్, కాన్సెప్ట్ ప్రకటన రోజునే విడుదల మంత్ కూడా ప్రకటించేసారు. ఆగస్టులో విడుదలవుతంది అంటూ చెప్పేసారు. ఇప్పటికే ఏప్రియల్ లో నాని జెర్సీ సినిమా రాబొతోంది. మూడునెలల…

నాని,-విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తయారవుతున్న టైటిల్, కాన్సెప్ట్ ప్రకటన రోజునే విడుదల మంత్ కూడా ప్రకటించేసారు. ఆగస్టులో విడుదలవుతంది అంటూ చెప్పేసారు. ఇప్పటికే ఏప్రియల్ లో నాని జెర్సీ సినిమా రాబొతోంది. మూడునెలల గ్యాప్ లో మరొటి అన్నమాట. అయితే అటు నాని కానీ ఇటు విక్రమ్ కుమార్ కానీ గతంలో ఎప్పుడూ తమ సినిమాల విడుదలను అంచనాగా ప్రకటించలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా అన్నదే క్వశ్చను.

ఆగస్టు 15న ప్రభాస్ భారీ సినిమా సాహో విడుదల అవుతోంది. అందువల్ల దానికి వారంముందుగా అంటే ఆగస్టు 9న అయితే నాని సినిమా వదలరు. అలాగే సాహో వచ్చిన వారానికి కూడా వదలడం రిస్క్. ఇక మిగిలిన డేట్ లు రెండే ఆగస్టు రెండు లేదా 30. అయితే నాని-విక్రమ్ కుమార్ సినిమాను ఆగస్టు 29 గురువారం విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది.

ఇదిలావుంటే శర్వానంద్-సమంతల కాంబినేషన్ లో నిర్మాత దిల్ రాజు నిర్మించే 96 రీమేక్ ను ఆగస్టులో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయం బయటకు రాలేదు కానీ, ఇండస్ట్రీ సర్కిళ్లలో మాత్రం ఇప్పటికే వినిపించింది. అందుకే విక్రమ్ కుమార్ సినిమాకు ఇలా ప్రకటించి వదిలినట్లు తెలుస్తోంది. ఇక ఆగస్టులో డేట్ లు అయిపోయినట్లే అనుకోవాలి. కచ్చితంగా 96కు వేరే డేట్ వెదుక్కోవాల్సిందే.

అంతా బాగానే వుంది కానీ,. విక్రమ్ కుమార్ తన సినిమాను ఆరునెలల్లో ఫినిష్ చేయగలరా? అన్నదే డవుట్. ఆయన ట్రాక్ రికార్డు చూస్తే, సినిమాను కాస్త పద్దతిగా, సటిల్డ్ గా తీస్తూ వెళ్తారు. అయితే స్క్రిప్ట్ మీద బన్నీ క్యాంప్ లో వుండి చాలాకాలం స్పెండ్ చేసారు కాబట్టి, మిగిలిన పని ఫాస్ట్ గానే అయిపోతుందనే ధీమా వుండి వుండాలి. అందుకే డేట్ ప్రకటించి వుండాలి.