ఆ అయిదుగురు వీరే

నాని-విక్రమ్ కుమార్ సినిమా థ్రెడ్ ఇదంటూ చాలాకాలం కిందంటే గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది. నాని రచయితగా కనిపిస్తాడని, అయిదుగురు మహిళల కోసం తాను రివెంజ్ తీసుకునే లాంటి పాయంట్ వుంటుందని తెలియజేసింది. అయితే దాంతో…

నాని-విక్రమ్ కుమార్ సినిమా థ్రెడ్ ఇదంటూ చాలాకాలం కిందంటే గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది. నాని రచయితగా కనిపిస్తాడని, అయిదుగురు మహిళల కోసం తాను రివెంజ్ తీసుకునే లాంటి పాయంట్ వుంటుందని తెలియజేసింది. అయితే దాంతో అయిదుగురు హీరోయిన్లు వుంటారంటూ గ్యాసిప్ లు పుట్టుకు వచ్చాయి. కానీ ఆ అయిదుగురు సంగతి ఇదంటూ, సినిమాలో అసలు విషయం దాచుకుండా ముందే రివీల్ చేసింది యూనిట్.

నాని బర్త్ డే సందర్భంగా సినిమా టైటిల్ గ్యాంగ్ లీడర్ ను ప్రకటిస్తూ, ఈ అయిదుగురు మహిళల సంగతి వెల్లడించింది. చిన్న పాప దగ్గర నుంచి బామ్మ వరకు వివిధ వయస్సుల మహిళలు ఆరుగురుతో కూడిన గ్యాంగ్, దానికి లీడర్ నాని అంటూ వివరించేసారు. మనిషి జీవితంలోని వివిధ దశలతో కూడిన కాన్సెప్ట్ అంటూ చిన్న హింట్ కూడా ఇచ్చారు. ఇలా ఇవ్వడం కూడా మంచిదే.

ఇధిలా వుంటే హీరో బన్నీకి విక్రమ్ కుమార్ చెప్పిన కథ ఇదే అని, దాన్నే ఇప్పుడు నాని హీరోగా చేస్తున్నారని వినిపిస్తోంది. సాధారణంగా విక్రమ్ కుమార్ కథలు, కథనాల విషయంలో వైవిధ్యం, టిపికల్ పద్దతి వుంటుంది. మరి అది బన్నీకి ఎందుకు నచ్చలేదో? నానికి ఎక్కడ నచ్చిందో? సినిమా విడుదలైతే కానీ తెలియదు.