సీతారామం..ఇలాంటి సినిమా ఇప్పుడు

జనాల్లో సున్నితత్వం తగ్గిపోతోంది. విక్రమ్, కేజిఎఫ్ 2, పుష్ప, అఖండ లాంటి భారీ బీభత్స, లౌడ్ మ్యూజిక్ తో కూడిన యాక్షన్ సినిమాలకు రోజులు నడుసున్నాయి అని సినిమా జనం లెక్కలు వేస్తున్న రోజుల్లో…

జనాల్లో సున్నితత్వం తగ్గిపోతోంది. విక్రమ్, కేజిఎఫ్ 2, పుష్ప, అఖండ లాంటి భారీ బీభత్స, లౌడ్ మ్యూజిక్ తో కూడిన యాక్షన్ సినిమాలకు రోజులు నడుసున్నాయి అని సినిమా జనం లెక్కలు వేస్తున్న రోజుల్లో అతి సున్నితమైన భావోద్వేగాలతో కూడిన సినిమా రాబోతోంది. 

ప్రేక్షకులు ఏది చూస్తారు..ఏది చూడరు అన్నది టాలీవుడ్ కు ఎప్పుడూ పజిల్ గానే వుంటుంది. ఇవే చూస్తారు అనుకుంటే అందుకు భిన్నమైన వాటిని కూడా ఆదరిస్తుంటారు. అదే ఆడియన్స్ చమక్కు.

ఈ ధైర్యంతోనే కావచ్చు. సీతారామం అనే ఫీల్ గుడ్ టైటిల్ తో భావుకత నిండిన ప్రేమకథను అందించే ప్రయత్నం చేస్తున్నారు హను రాఘవపూడి. ఇప్పటి వరకు బయటకు వచ్చిన పాటలు, ఫొటోలు, లుక్ లు అన్నీ కలిసి సీతారామం సినిమా పట్ల ఓ ప్రశాంతమైన భావం ఏర్పడేలా చేసాయి. 

హీరో దుల్కర్ సల్మాన్ వింటేజ్ లుక్ కానీ, హీరోయిన్ మృణాల్ హావ భావాలు కానీ అన్నీ ఎక్కడో టచ్ చేసేలా వున్నాయి.

అసలు సినిమా టైటిల్ కు ఇచ్చిన ట్యాగ్ లైన్ ‘యుద్దంతో రాసిన ప్రేమలేఖ’ అన్నదే భలేగా వుంది. ఇప్పటి వరకు విడుదల చేసిన పాటలు, లుక్ ల చిత్రీకరణ, కలర్ స్కీమ్ అన్నీ కూడా ఓ క్లాసీ టచ్ తో వున్నాయి. 

ఇదంతా ఓ విధంగా ధైర్యం చేయడమే. ముందే చెప్పుకున్నట్లు లౌడ్ సౌండ్, ఎలివేషన్లు, యాక్షన్ సీన్ల కాలంలో ఓ డీసెంట్, క్లాసీ లవ్ స్టోరీని అటెంప్ట్ చేయడం అంటే అను దర్శకుడు హను రాఘవపూడి, ఇటు నిర్మాతలు అయిన స్వప్న సినిమాస్ కు కాస్త ధైర్యం ఎక్కువే అనుకోవాలి.

నాగ్ అశ్విన్ లాంటి దర్శకుడు ఈ ప్రాజెక్ట్ బ్యాక్ బోన్ గా వున్నాడు. అదే ఈ ధైర్యానికి కారణం కావచ్చు.