వారియర్ మీద ఇండస్ట్రీ చూపు

జనం థియేటర్ కు వస్తున్నట్లా? రానట్లా? ఇది టాలీవుడ్ ను వేధిస్తున్న ప్రశ్న. సినిమాల కలెక్షన్లు ఒక్కోసారి ఆశాజనకంగా వుంటున్నాయి. ఒక్కోసారి నిరాశ కలిగిస్తున్నాయి. సరైన సినిమా పడితే కలెక్షన్లు వస్తాయి అనిపిస్తోంది కొన్నిసార్లు.…

జనం థియేటర్ కు వస్తున్నట్లా? రానట్లా? ఇది టాలీవుడ్ ను వేధిస్తున్న ప్రశ్న. సినిమాల కలెక్షన్లు ఒక్కోసారి ఆశాజనకంగా వుంటున్నాయి. ఒక్కోసారి నిరాశ కలిగిస్తున్నాయి. సరైన సినిమా పడితే కలెక్షన్లు వస్తాయి అనిపిస్తోంది కొన్నిసార్లు. అస్సలు ఓపెనింగ్ పడకపోతే జనం థియేటర్ వైపు చూడడం తగ్గిందా అనిపిస్తోంది. 

ఎఫ్ 3 లాంటి ఎంటర్ టైన్ మెంట్ సినిమా ఇప్పటికీ ఇంకా థియేటర్ రెంట్లు, కొన్ని రోజలు షేర్ రాబడుతుంటే జనం థియేటర్ కు దూరం కాలేదు అనే భరోసా వస్తోంది. పక్కా కమర్షియల్ లాంటి కమర్షియల్ ప్యాకేజ్ సినిమాలకు ఓపెనింగ్స్ రాకపోతే మళ్లీ డౌట్ కొడుతూంది.

ఏ సినిమా చూడాలో..ఏ సినిమాను ఓటిటి కోసం పక్కన పెట్టాలో అన్న ఫుల్ క్లారిటీ జనాలకు వచ్చేసిందనే అభిప్రాయం బలపడుతోంది మరోపక్కన. ఇలాంటి టైమ్ లో వారియర్ సినిమా మరో వారంలో రాబోతోంది. ఓపెనింగ్ బాగా రావడానికి అవకాశం వున్న సినిమా. ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్ తరువాత రామ్ సినిమా. 

తెలుగువారికి పరిచయం వున్న లింగుస్వామి తొలి తెలుగు సినిమా. పాటలు ఇప్పటికే పాపులర అయ్యాయి. కృతి శెట్టి గ్లామర్ పాయింట్ వుంది. ఫుల్ యాక్షన్ ప్లస్ మాస్ ఎంటర్ టైనర్

అందువల్ల ఈ సినిమాకు కూడా ఓపెనింగ్ పడకపోతే కచ్చితంగా కాస్త అనుమానం పడాల్సిందే. అప్పుడు టాలీవుడ్ జనాలు కచ్చితంగా ఆలోచించుకోవాల్సి వుంటుంది.

టార్గెట్ పెద్దదే

వారియర్ టార్గెట్ తక్కువేమీ కాదు. ఆంధ్ర, సీడెడ్, నైజాం కలిసి థియేటర్ల మీద 30 నుంచి 35 కోట్ల షేర్ రాబట్టాల్సి వుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఫీట్ సాధిస్తే టాలీవుడ్ కు పెద్ద ఊరట లభిస్తుంది. 

వారియర్ తరువాత మళ్లీ మిడ్ రేంజ్ సినిమాలే వున్నాయి అన్నీ. అందువల్ల ఆడియన్స్ పల్స్ తెలుసుకునేందుకు వారియర్ నే టెస్ట్ గ్రౌండ్.