మహేష్ కు ఏమయింది?

ఇప్పుడు మహర్షి యూనిట్ లో జనాల గుసగుస ఇదే. మహేష్ అంటే చకచకా షూటింగ్ చేసేస్తారు అని పేరు. కాల్ షీట్లు ఇవ్వడం మాత్రమే ఆలస్యం. షూటింగ్ లకు ఇబ్బణది పెట్టరు. కానీ ఈ…

ఇప్పుడు మహర్షి యూనిట్ లో జనాల గుసగుస ఇదే. మహేష్ అంటే చకచకా షూటింగ్ చేసేస్తారు అని పేరు. కాల్ షీట్లు ఇవ్వడం మాత్రమే ఆలస్యం. షూటింగ్ లకు ఇబ్బణది పెట్టరు. కానీ ఈ మధ్య మహేష్ తీరు మారిపోయిందని వినిపిస్తోంది. అలా అని కొందరు హీరోల్లా లాస్ట్ మినిట్ లో మహేష్ షూటింగ్ కు డుమ్మాకొట్టడం లేదు. ఆయన రావడమే షూటింగ్ కు ఆలస్యంగా వస్తున్నారు. ఆ మాటకు వస్తే కొన్నిసార్లు మరీ ఆలస్యంగా వస్తున్నారు అని తెలుస్తోంది.

అంతేకాదు, గతంలో అంత చరుకుగా, చకచకా షూటింగ్ చేయడం లేదని, దానివల్ల మహర్షి సినిమా షెడ్యూళ్లు, వర్క్ అనుకున్నదాని కన్నా చాలా వెనకపడిందని తెలుస్తోంది. దీనివల్ల పరోక్షంగా బడ్జెట్ కూడా పెరిగిపోతోందని తెలుస్తోంది.

మహేష్ కు షూటింగ్ మాత్రమే కాకుండా, ఇతరత్రా వర్క్ లు పెరిగిపోయాయని టాక్ వినిపిస్తోంది. ప్రకటనలు, బ్రాండ్ అంబాసిడర్, పెట్టుబడుల పనులు, చిన్న సినిమాల నిర్మాణం, వెబ్ సీరీస్ ఆలోచనలు ఇలా చాలా వున్నాయి మహేష్ ఆలోచనల్లో. వాటి మీద మీటింగ్ లు, డిస్కషన్లు ఇలా చాలా వాటిమీద మహేష్ కాన్సన్ ట్రేట్ చేయాల్సి వస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందువల్లనే మహేష్ తరచు షూటింగ్ కు లేట్ అవుతున్నారని తెలుస్తోంది. ఆయన ఎప్పుడు అప్పుడు మొదలు పెట్టి, ఎంత వీలయితే అంతచేసి, మిగిలినది మర్నాటికి వాయిదా వేయాల్సి వస్తోంది. అసలే వంశీ పైడిపల్లి రూపాయికి రూపాయిన్నర ఖర్చు పెట్టిస్తారని టాక్. దానికి తోడు ఈ ఆలస్యాల వ్వవహారం.

దాంతో మహర్షి బడ్జెట్ అనుకున్నదానికన్నా భయంకరంగా పెరిగిపోతోందని తెలుస్తోంది. అంతేకాదు, ఈ సినిమాను ఏప్రియల్ 25న షెడ్యూలు చేసారు. కానీ విడుదల చేయగలరా? అన్నది అనుమానంగా మారింది.

 ప్రజలు చంద్రబాబు కన్నా తెలివైన వారు!