ఫ్లాప్ డైరక్టర్ కు మరో ఛాన్స్

అట్టర్ ఫ్లాపులు ఇచ్చిన దర్శకుల్ని ఆదుకోవడంలో అందరికంటే ముందుంటున్నాడు హీరో శర్వానంద్. మొన్నటికిమొన్న హను రాఘవపూడికి పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు చందు మొండేటికి అలాంటి ఛాన్స్ ఇస్తున్నాడు. Advertisement అవును.. చందు…

అట్టర్ ఫ్లాపులు ఇచ్చిన దర్శకుల్ని ఆదుకోవడంలో అందరికంటే ముందుంటున్నాడు హీరో శర్వానంద్. మొన్నటికిమొన్న హను రాఘవపూడికి పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు చందు మొండేటికి అలాంటి ఛాన్స్ ఇస్తున్నాడు.

అవును.. చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు శర్వానంద్. ఈ మేరకు చర్చలు పూర్తయ్యాయి. స్టోరీ లాక్ అయింది. 96 రీమేక్ కంప్లీట్ అయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. రీసెంట్ గా సవ్యసాచి సినిమాతో ఫ్లాప్ ఇచ్చాడు చందు మొండేటి.

ఇలా ఫ్లాప్ డైరక్టర్లను ఆదుకోవడం శర్వానంద్ కు కొత్తేంకాదు. గతంలో ఇలానే చేశాడు. ఇప్పుడు అదే చేస్తున్నాడు. లై సినిమా ఎంత ఎంత ఫ్లాప్ అయిందో అందరికీ తెలుసు. కానీ హను రాఘవపూడిపై నమ్మకంతో పడి పడి లేచే మనసు సినిమా ఛాన్స్ ఇచ్చాడు శర్వా. కానీ హను మాత్రం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయాడు.

ఇప్పుడు చందు మొండేటి విషయంలో కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు శర్వానంద్. సవ్యసాచి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అతడిపై నమ్మకంతో ఆఫర్ ఇచ్చాడు. మరి చందు మొండేటి అయినా శర్వా నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడేమో చూడాలి.

 ప్రజలు చంద్రబాబు కన్నా తెలివైన వారు!