చిరు : ప్రజలు అక్కర్లేదు, సినిమావాళ్లు చాలు

ఎవరైనా సరే టార్గెట్ ను బట్టే అడుగులు వేస్తుంటారు. రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా వ్యక్తిగత జీవితాల్లో అయినా.. టార్గెట్ ఏంటో ముందే ఫిక్స్ చేసుకున్న తర్వాత.. దాన్ని బట్టి మాత్రమే నిర్ణయాలు చేతలు…

ఎవరైనా సరే టార్గెట్ ను బట్టే అడుగులు వేస్తుంటారు. రాజకీయాల్లో అయినా సినిమాల్లో అయినా వ్యక్తిగత జీవితాల్లో అయినా.. టార్గెట్ ఏంటో ముందే ఫిక్స్ చేసుకున్న తర్వాత.. దాన్ని బట్టి మాత్రమే నిర్ణయాలు చేతలు జరుగుతూ ఉంటాయి. ఇపుడు మెగాస్టార్ చిరంజీవి దాతృత్వం గమనిస్తే ఈ విషయం మరోమారు మనకు స్ఫురణకు వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తాజాగా, కరోనా దెబ్బనుండి కాపాడడానికి రూ.కోటి విరాళం ప్రకటించారు. అయితే ఎవరికి ప్రకటించారు? అనేదే ఇక్కడ కీలకాంశం.

కరోనా లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేద సినిమా కార్మికుల సంక్షేమం కోసం వెచ్చించడానికి చిరంజీవి ఈ కోటి రూపాయలు విరాళం అందించారు. ఇది గమనించాల్సిన అంశం.

ఒకప్పట్లో ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో , కాగలననే నమ్మకంతో రాజకీయ పార్టీ స్థాపించి.. అంతోఇంతో ప్రజల అభిమానం కూడా పొంది.. ఆ తర్వాత.. పార్టీని నడపలేక దాన్ని కాంగ్రెసులో కలిపేసి.. అప్పనంగా కేంద్ర మంత్రి పదవిని కూడా పుచ్చుకుని.. ఆ వైభవాన్ని కూడా ఒకదఫా వెలగబెట్టిన మెగాస్టార్.. కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్న సామాన్య ప్రజలకోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఆయన తమ్ముడు పవన్ కల్యాణ్ ఏకంగా రెండు కోట్ల రూపాయలు, కొడుకు రామచరణ్ 70 లక్షల రూపాయలు ఇచ్చారు కానీ… చిరు మాత్రం కేవలం సినిమా కార్మికులకు మాత్రమే ఇచ్చారు.

దీనిని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటున్నది ఏంటంటే… మెగాస్టార్  భవిష్యత్ అడుగులు మళ్లీ ప్రజలవైపు, రాజకీయం వైపు పడే అవకాశం లేదన్నమాట. కేవలం సినిమా రంగం వైపు మాత్రమే ఆయన భవిష్య ప్రస్థానం సాగనుంది. అందుకు సంకేతంగానే.. చిరు.. కేవలం సినిమా కార్మికుల సంక్షేమాన్ని ఉద్దేశించి కోటి రూపాయలు ఇచ్చారని అంతా అనుకుంటున్నారు.

అందర్నీ చూసుకుంటా.. ఎక్కడివాళ్ళు అక్కడే ఉండండి

ఆంధ్రాకి పోవాలా.. ఈ క్యూలైన్ చుడండి