రఘురామ రాజు..ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే!

ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అని ఉర్దూలో ఒక సామెత ఉంటుంది. తేడాగాడైన దొంగ.. పోలీసోడి వెంటపడి తరిమాడనేది.. ఆ సామెత అర్థం. ఇప్పుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రఘురామక్రిష్ణ…

ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అని ఉర్దూలో ఒక సామెత ఉంటుంది. తేడాగాడైన దొంగ.. పోలీసోడి వెంటపడి తరిమాడనేది.. ఆ సామెత అర్థం. ఇప్పుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రఘురామక్రిష్ణ రాజు వైనం అలాగే కనిపిస్తోంది. ఆయన మాటలు, వ్యవహారం ఆయనే ఎదురు తెలంగాణ పోలీసులకు చేసిన ఫిర్యాదు తీరు అన్నీ ఈ సామెతకు నిదర్శనంలాగానే ఉన్నాయి.

భీమవరం సభకు వెళ్తున్నానంటూ.. రైల్లో బయల్దేరి, చిన్న బిల్డప్ మరియు ఒక వీడియో ద్వారా వీలైనంతన మైలేజీకోసం ప్రయత్నించారు. రైల్లో వెళుతున్న తనను ఎవరో వెంటాడుతున్నారని ఆయనకు ఆకాశవాణి చెప్పిందో ఏమో గానీ ఆ మిషమీద బేగంపేటలో దిగేసి ఇల్లు చేరుకున్నారు. అంతవరకు ఊరుకుంటే బాగుండేది. 

ఏపీ సీఐడీ పోలీసుల మీద ఆయన హైదరాబాదులో పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం. తనని తన కుటుంబం మొత్తాన్ని చంపడానికి పోలీసులు వచ్చారని ఆయన ఫిర్యాదులో పేర్కొనడం విశేషం.

జనం అందరికీ ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే..’ అనే సామెత గుర్తు రావడానికి కూడా కారణం ఈ కంప్లయింటే. దీని వెనుక చాలా పూర్వరంగమే ఉంది..

సోమవారం ఉదయం ఓ వ్యక్తి రఘురామక్రిష్ణరాజు ఇంటి వద్ద కనిపించాడు. అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఎంపీ కి చెందిన సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకుని ఆరా తీస్తే తాను సీఐడీ పోలీసునని చెప్పాడు. ఐడీ కార్డు అడిగితే చూపించలేదు. దాంతో సెక్యూరిటీ వారు, ఎంపీ కొడుకు అందరూ కలిసి అతడిని చితక్కొట్టారు. 

ఆ తర్వాత సదరు సీఐడీ కానిస్టేబుల్ తన మీద జరిగిన దాడి గురించి కొట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనికి కౌంటర్ గా రఘురామరాజు తాను మరొక కంప్లయింటు ఇచ్చారు. తన ఇంటిలోకి చొరబడడానికి సదరు సీఐడీ కానిస్టేబుల్ ప్రయత్నించాడని, తన హత్యకు, తన కుటుంబసభ్యుల హత్యకు ఏపీ సీఐడీ పోలీసులు కుట్ర చేస్తున్నారనేది ఆ కంప్లయింటు సారాంశం.

ఈ విషయాన్ని లోతుగా గమనిస్తే..

రఘురామరాజు అనే ఎంపీ అనేకానేక సీఐడీ కేసుల్లో నిందితుడు. ఆయన కోసం పోలీసులు వెతుకుతుండడంలో ఆశ్చర్యం లేదు. అదేమీ నేరం కాదు. అయితే ఇంట్లోకి చొరబడ్డానికి ప్రయత్నించడా లేదా అనేది సీసీ టీవీ ఫుటేజీ చూస్తే తెలుస్తుంది.

తన యూట్యూబ్ చానెల్లో జగన్ ను తిట్టడం ద్వారా డబ్బు సంపాదించడం అలవాటు చేసుకున్న వారికి ఈ సీసీ టీవీ ఫుటేజీని ఇచ్చి.. రఘురామ హత్యకు ఏపీ సీఐడీ పోలీసుల ప్రయత్నం సీక్రెట్ ఫుటేజీ అని థంబ్ నెయిల్ పెడితే.. కనకవర్షం కురుస్తుంది. అది వాస్తవం అయితే ఆ పని చేయవచ్చు. 

చొరబడ్డ సంగతి కూడా నిజమే అనుకుందాం. తాను సీఐడీ పోలీసుని అని చెప్పుకున్న వ్యక్తి.. అడిగితే ఐడీ చూపించలేదనే అనుకుందాం. అంతమాత్రాన అందరూ కలిసి చితక్కొడతారా? ఎంపీ కొడుకు, లేదా సెక్యూరిటీ సిబ్బంది.. రౌడీయిజం చేయడానికి డిసైడయ్యారా? అనేది ప్రజల సందేహం. ఆ వ్యక్తి మీద అనుమానం ఉంటే.. ఎటూ పట్టుకున్నారు గనుక.. తీసుకెళ్లి.. చొరబడ్డాడు అని వీడియో సాక్ష్యం చూపించి.. పోలీసులకు అప్పజెప్పాలి. 

రాజ్యాంగంలోని పాయింటులను చాలా విపులంగా మాట్లాడే ఎంపీ సిబ్బందికి కనీస పద్దతి తెలియకపోతే ఎలాగ? మనిషి దొరకగానే చితక్కొట్టేయడం అలవాటుగా మార్చుకుంటే.. కేసులు ఎదుర్కోవాల్సిందే. నామీద హత్యకు వచ్చారంటూ ఎదురు కంప్లయింట్లు ఇస్తే ఫలితముండదు!