మన సినిమాను ఎవరో ఏదో అన్నంత మాత్రాన బూతులతో విరుచుకుపడడం సంస్కారం అనిపించుకుంటుందా? సహేతుకమైన, సరైన సమాధానం ఇవ్వడం సరైన పద్దతి కదా?
అస్కార్ విన్నర్ రసూల్ పూకుట్టి మీద ఆర్ఆర్ఆర్ సినిమా మద్దతు దారులు, రాజమౌళి సన్నిహితులు తలా కామెంట్ తో విరుచుకుపడుతున్నారు. తప్పు లేదు. ఎందుకంటే రసూల్ చేసిన కామెంట్ కూడా అలాగే వుంది కాబట్టి.
ఈ మధ్య కొంత కాలంగా ఆర్ఆర్ఆర్ ను గే లవ్ స్టోరీ అనే విధంగా కామెంట్లు మొదలయ్యాయి. అది యాంటీ ఫ్యాన్స్ వ్యవహారం కాదు. ఎవరికో అలా అనిపించి వుండొచ్చు.
ఆ విధంగా కామెంట్ చేసి వుంటే వుండొచ్చు. దానికి చెప్పాల్సిన విధంగా సమాధానం చెబితే సరిపోతుంది. చాలా మంది అదే పని చేస్తున్నారు కూడా. కానీ కీరవాణి ట్వీట్ తో చెప్పిన సమాధానం దారుణంగా వుంది.
తనకు ఇంగ్లీష్ భాషలో పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాలు ఎలా వాడాలో సరిగ్గా తెలియదు అంటూ రసూల్ పూకోట్టి పేరును తనకు నచ్చిన బూతుమాటగా విరిచి ట్వీట్ పెట్టారు.
ఇది సహేతకమైన సమాధానం అని ఎంత మాత్రం అనిపించుకోదు. తమకు నచ్చిన మాట చెప్పిన వారికి పరుషమైన సమాధానం ఇవ్వడం సబబే కానీ బూతులతో సమాధానం ఇవ్వడం మాత్రం ముమ్మాటికీ తప్పే.