cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మెగాస్టారూ…నెంబర్ గేమూ

మెగాస్టారూ…నెంబర్ గేమూ

ఇన్నేళ్లు టాలీవుడ్ లో టాప్ స్టార్ గా వున్నపుడు అవసరం పడలేదు. టాలీవుడ్ బాస్ గా వున్నన్నాళ్లు అటు దృష్టి పెట్టలేదు. కానీ గట్టిగా ఓ ఫ్లాపు, మరో డిజాస్టర్ పలకరించేసరికి అవసరం పడిపోయింది. 

చిరంజీవిగా ఎన్ని హిట్ లు..ఎన్ని బ్లాక్ బస్టర్లు..కానీ ఇప్పుడు సైరా, ఆచార్య ఫలితాలు తేడా వచ్చేసరికి పేరు మార్చుకోవాల్సి వచ్చేసిందా? CHIRANJEEVI అన్న పేరు CHIRANJEEEVI గా మార్చుకుంటే హిట్ వరిస్తుందని చెప్పిన న్యూమరాలజిస్ట్ ఎవ్వరో?

ఇలా మార్చుకునే సెలబ్రిటీలు సినిమా రంగంలో చాలా మందే వున్నారు. సాయి ధరమ్ తేజ కాస్తా సాయితేజ్ గా మారారు. మారుతి..మారుతీగా మార్చుకుని మళ్లీ వెనక్కు వచ్చారు. 

ఇలా పేరులో చిన్న చిన్న మార్పులు చేసుకున్న వారు చాలా మందే వున్నారు. వారంటే సక్సెస్ లు చవి చూడని వారు..ఒకటో రెండో సక్సెస్ లు చవి చూసిన వారు. కానీ చిరంజీవి విజయాల కొరతేం లేదు కదా?

మరి ఆయనెందుకో గాడ్ ఫాదర్ సినిమా లుక్ లో CHIRANJEEEVI అని పేర్కొన్నట్లు? అపజయం మరీ అంతలా బాధించిందా? లేదా విజయం మరీ అంతలా అవసరం పడిందా?

ఇదిలా వుంటే..

‘’..35 నెంబర్ గతంలో…అప్పుడు శనిమహర్దశ నడుస్తోంది. కనుక అప్పుడు సరిపోయింది. కానీ ఇప్పుడు బుధ మహర్దశ మొదలైంది. ఇప్పుడు 40 నెంబర్..అంటే రాహువు నెంబర్. ఆగస్ట్ 22..అంటే నాలుగు..ఈ నాలుగు నెంబర్ కు మ్యాచ్ చేసారు. అందువల్ల ఇప్పుడు వృత్తి పరంగా బాగుండే అవకాళం వుంది…’’

అని ఓ న్యూమరాలజిస్ట్ తెలిపారు.

 

జగన్ ముందు కుప్పిగంతులు పనికిరావు

బ్లాక్ లో టికెట్ లు అమ్మిన సప్తగిరి