నిఖిల్-అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్ లో ప్రతాప్ అందిస్తున్న సినిమా 18 పేజెస్. సుకుమార్ రైటింగ్స్ తో కలిపి జిఎ2 సంస్థ నిర్మిస్తోంది. గతంలో కుమారి 21 ఎఫ్ అందించిన తరువాత డైరక్టర్ ప్రతాప్ కు ఇదే మలి సినిమా.
ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. రొటీన్ గా కాకుండా కాస్త ఇంట్రస్టింగ్ గా వుందీ పోస్టర్. హీరో కళ్లకు గంతలు మాదిరిగా కాగితం చుట్టారు. దానిపై హీరోయిన్ అక్షరాలు రాస్తోంది. ఈ కాన్సెప్ట్ పోస్టర్ వెనుక ఇంట్రస్టింగ్ స్టోరీ వుందని తెలుస్తోంది.
సినిమాలో కథ ఓ డైరీ చుట్టూ తిరుగుతుందని, ఆ డైరీనే హీరోయిన్ తో హీరోకు కనెక్షన్ ఏర్పాటు చేస్తుందని తెలుస్తోంది. హీరోయిన్ రాసుకునే ఆ డైరీకి సింబాలిక్ షాట్ మాదిరిగా ఫస్ట్ లుక్ ను సెట్ చేసారు.
బన్నీ వాస్ నిర్మించే ఈ సినిమాకు గోపీసుందర్ నిర్మాత. అల్లు అరవింద్ సమర్పణ.